RTI Chief Commissioner | రాష్ట్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్ గా డాక్టర్ జీ.చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుంచి మూడేళ్ల పాటు లేదా 65 సంవత్సరాల వయస్సు వరకు ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొన్నారు.
డాక్టర్ జీ.చంద్రశేఖర్ రెడ్డి స్వస్థలం అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరెగామ్ గ్రామం. ఉస్మానియా యూనివర్సిటీ లో బీఎస్సీ ఫారెస్ట్రీ చేసిన ఆయన 1991 బ్యాచ్ ఇండియన్ ఫారెస్టు సర్వీసు అధికారిగా ఎంపికయ్యారు. తొలుత 1994 లో నిజామాబాద్ జిల్లా సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గా ప్రభుత్వ సర్వీసులో చేరారు. వివిధ హోదాలలో పనిచేసిన ఆయన ఆర్టీఐ ప్రధాన కమిషనర్ గా ఎంపికకు ముందు రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు తో పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. ఆర్టీఐ ప్రధాన కమిషనర్ పదవి కోసం మూడు నెలల ముందు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
New Pope | వాటికన్ కొత్త పోప్ ఆయనేనా? బుధవారం నుంచి కార్డినల్స్ కాంక్లేవ్
Waqf (Amendment) Act, 2025 | వక్ఫ్ సవరణ చట్టం కేసులో సీజేఐ ఖన్నా సంచలన నిర్ణయం
Universe End | ఆకాశ పెను తుఫాన్‌తో తుడిచిపెట్టుకుపోనున్న విశ్వం! నిజమేనా? శాస్త్రవేత్తలేమంటున్నారు?