Ola Uber Rapido Strike : రేపు దేశ వ్యాప్తంగా ర్యాపిడో, ఉబర్ సహా యాప్ రవాణా డ్రైవర్ల సమ్మె

దేశ వ్యాప్తంగా రేపు ఉబర్, ఓలా, ర్యాపిడో సహా యాప్ రవాణా డ్రైవర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు సేవలు నిలిచే అవకాశం ఉంది.

Ola Uber Rapido strike tomorrow

విధాత, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా రేపు ర్యాపిడో, ఉబర్, ఓలా, పోర్టర్, అంకుల్, మూవర్ క్యాబ్ సంస్థల డ్రైవర్లు సమ్మెకు దిగనున్నారు. ఉదయం 6గంటల నుంచి 12గంటల వరకు వారు సమ్మె నిర్వహిస్తారు. దీంతో ఆ సమయంలో దేశ వ్యాప్తంగా ఆయా యాప్ రవాణా సంస్థల సర్వీస్ లు నిలిచిపోనున్నాయి.

తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్ ఫోరమ్(టీఏడీఎఫ్), తెలంగాణ గిగ్ ఫ్లాట్ ఫారమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సమ్మె కొనసాగనుంది. ఆన్ లైన్ యాప్ ఆధారిత రవాణా కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని యూనియన్ ఆరోపించింది. కనీస ప్రాథమిక చార్జీలను నోటిఫై చేయాలని, క్యాబ్ కిలోమీటర్ కు రూ.25 తగ్గకుండా ఫిక్స్ చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల క్యాబ్ ఆటో వాహనాలను నిషేధించాలని డిమాండ్ చేశారు.కంపెనీలు ఏకపక్ష్ంగా చార్జీలు నిర్ణయిస్తూ డ్రైవర్ల ఆదాయాన్ని దోచుకుంటున్నాయని ఫోరమ్ ఆరోపిస్తుంది. ప్రభుత్వం కనీస చార్జీలను నిర్ణయించడంతో విఫలమవ్వడంతో డీజిల్, పెట్రోల్, ఇంధన ఖర్చులను డ్రైవర్లపై వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణ గిగ్ ఫ్లాట్ ఫారమ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్, ఏఐటీయూసీ వెంకటేశం, బీఆర్ టీయూ నగేశ్ కుమార్, అబ్దుల్ రవూఫ్, సతీశ్ కుమార్, ఆర్కే రెడ్డి, కొండల్ రెడ్డి, బాల్ రెడ్డిలు సమ్మె నిర్వహణకు ప్రజలు సహకరించాలని కోరారు. ఓలా, ఉబర్, ర్యాపిడో, పోర్టర్, అంకుల్, మూవర్ వంటి ఆన్​ లైన్ ఆధారిత రవాణా కార్మికుల సమస్యలను కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు.

ఇప్పటివరకు ప్రభుత్వం కనీస ప్రాథమిక చార్జీలను నోటిపై చేయలేదన్నారు. దీంతో ఆయా కంపెనీలు డ్రైవర్ల ఆదాయాన్ని ఏకపక్షంగా తగ్గిస్తూ కమిషన్లను పెంచుకుంటున్నాయని ఆరోపించారు. ఇప్పటికే పెట్రోల్​, డీజిల్​ధరల పెరుగుదల, వాహన నిర్వహణ ఖర్చులు, బీమా ఇతర ఖర్చులు పూర్తిగా డ్రైవర్ మీదనే పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు స్పందించి గుర్తింపు పొందిన డ్రైవర్ యూనియన్ లతో సంప్రదించి రవాణా సేవలకు కనీస ప్రాథమిక చార్జీలను నోటిఫై చేయాలని డిమాండ్ చేశారు. క్యాబ్ కిలోమీటర్ కు రూ.25 తగ్గకుండా ఫిక్స్ చేయాలని కోరారు. రాష్ట్రంలోకి రాకుండా ఇతర రాష్ట్ర క్యాబ్ ఆటో వాహనాలను తక్షణమే నిషేధించాలని కోరారు.

ఇవి కూడా చదవండి :

Rs 49 Cr In Abu Dhabi Big Ticket : కుమార్తె రూపంలో వ‌రించిన అదృష్టం.. లాట‌రీలో రూ.49 కోట్లు గెలుచుకున్న క‌ర్ణాట‌క‌ యువ‌కుడు

Student Misbehaves With Teacher : న‌డిరోడ్డుపై టీచ‌ర్ పెద‌వి కొరికిన విద్యార్థి.. షాకింగ్ వీడియో

Latest News