Site icon vidhaatha

బాలీవుడ్‌కు.. తెలుగువాళ్లు నేర్పిస్తున్నారు

గుంటూరు కారం, డాకు మ‌హారాజ్ వంటి భారీ సినిమాల నిర్మాత నాగ‌వంశీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పా్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న ఎంత‌టి భారీ సినిమాలు నిర్మిస్తాడో అదే రేంజ్‌లో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో నిత్యం వార్త‌ల్లో నానుతూ ఉంటాడు. ఆ మ‌ధ్య గుంటూరు కారం, దేవ‌ర సినిమాల స‌మ‌యంలో ఆయ‌న వ్యాఖ్య‌లు చేసిన దుమారం అంతా ఇంతా కాదు.

అయితే ఆయ‌న‌ మ‌రోసారి అలాంటి మాట‌ల‌తో ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. రీసెంట్‌గా ఓ మీడియా సంస్థ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో అన్ని ఇండ‌స్ట్రీల నుంచి ప్రొడ్యూస‌ర్స్ పాల్గొన్నారు. బాలీవుడ్ నుంచి బోనీ క‌పూర్‌, సౌత్ నుంచి హీరో సిద్ధార్థ్‌, నిర్మాత నాగ‌వంశీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా నాగ‌వంశీ, బోనీ క‌పూర్‌ల మ‌ధ్య కాస్త ఘాటైన చ‌ర్చ జ‌రిగింది. వంశీ మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం బాలీవుడ్‌కు సినిమాలు ఎలా తీయాలో సౌత్ వాళ్లు నేర్పుతున్నార‌ని ఈ క్ర‌మంలో బాహుబలి, త్రిబుల్ ఆర్, పుష్ప, యానిమల్ చిత్రాలు, న‌టులు బాగా ప్ర‌భావం చూపిస్తున్నార‌న్నారు. కొంచెం హార్ష్‌గానే ఉన్నా మీరు ఒప్పుకోని తీరాల్సిన నిజం అన్నారు.

యానిమల్‌, జవాన్‌ సినిమాలు దక్షిణాది వాళ్లు తెరకెక్కించినవే. హిందీ చిత్ర పరిశ్రమ ముంబయికే మాత్ర‌మే పరిమితమైందన్నారు. దీనికి బోనీ క‌పూర్ అంగీక‌రించ‌కుండా అలా ఏం లేద‌ని.. పుష్ప సినిమా హీరో అమితాబ్‌ ఫ్యాన్ అనే విష‌యం గుర్తు పెట్టుకోవాల‌న్నాడు. దానిదేముంది సార్ అర్జున్ చిరంజీవి కూడా పెద్ద ఫ్యాన్, నేను షారుఖ్ ఖాన్ ఫ్యాన్ అంటూ నాగ‌వంశీ చెప్పుకొచ్చాడు.

Exit mobile version