Gold Rate | బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇటీవల కాలం బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు స్వల్పంగా దిగిరావడంతో సామాన్యులు ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పైకి ఎగబాకాయి. శనివారం 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ.200పెరిగి తులం రూ.83,600కు చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల పసిడిపై రూ.220 పెరిగి తులానికి రూ. 91,200వేలకు పెరిగింది.
హైదరాబాద్ తో పాటు..బెంగుళూర్, ముంబాయ్, చైన్నై నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే 22 క్యారెట్ల గోల్డ్ రూ.83,600 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.91,200 పలుకుతున్నది. ఇక తరుచూ వార్తల్లో నిలిచూ దుబాయ్‌లో 22క్యారెట్ల 10గ్రాముల ధర రూ80,098గా, 24క్యారెట్ల ధర 86,497గా ఉంది. అమెరికాలో 22క్యారెట్లకు రూ.79,097గా, 24క్యారెట్ల 10గ్రాములకు 84,822గా ఉంది.
వెండి ధరలు
వెండి ధర కిలోపై రూ 1000తగ్గగా..రూ.1,04,000లకు చేరుకుంది. హైదరాబాద్ , చైన్నైలో కిలో వెండి రూ.1,13,000, బెంగళూరులో రూ.1,04,000గా కొనసాగుతోంది.