విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) కాంబోలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ సితార (Sithara Entertainments) బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. తాజాగా బుధవారం ఈ మూవీ టైటిల్ ప్రకటిస్తూ టీజర్ రిలీజ్ చేశారు.
ఈ టీజర్‌కు జూ.ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వగా సినిమాకు కింగ్‌డమ్ (Kingdom) అనే పేరు ఫైనల్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. హిందీలో రణబీర్ కపూర్, తమిళంలో సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చారు. మే నెల చివరలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్‌ను చూస్తే హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌లో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తుంది. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అదించాడు.