Rashmika-Vijay Wedding | విజ‌య్‌తో పెళ్లి.. రష్మి‍కకు రౌడీబాయ్‌ పేరెంట్స్ పెట్టిన కండిష‌న్స్‌ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ స్టార్స్‌ విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda), ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) పెళ్లి వేడుక‌లు మొద‌ల‌య్యాయి. ఈ నేపథ్యంలో వీళ్ల లవ్ స్టోరీ జర్నీ, విజయ్ పేరెంట్స్ తమ కాబోయే కోడలికి ఉండాల్సిన లక్షణాల గురించి గ‌తంలో మాట్లాడిన వీడియో ఒకటి ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Rashmika-Vijay Wedding

Rashmika-Vijay Wedding | టాలీవుడ్ స్టార్స్‌ విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda), ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) పెళ్లి వేడుక‌లు మొద‌ల‌య్యాయి. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని (Udaipur Wedding) ఐటీసీ మెమోంటోస్ హోట‌ల్‌లో వివాహ వేడుక‌లు ఆరంభ‌మ‌య్యాయి. పూల్ పార్టీ (pool party)తో వేడుక‌లు షురూ అయ్యాయి. ఫిబ్ర‌వ‌రి 26న వీరిద్ద‌రూ వివాహ బంధంతో ఒక్క‌టికాబోతున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ల లవ్ స్టోరీ జర్నీ, విజయ్ పేరెంట్స్ తమ కాబోయే కోడలికి ఉండాల్సిన లక్షణాల గురించి గ‌తంలో మాట్లాడిన వీడియో ఒకటి ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

గ‌తంలో జ‌రిగిన ఓ సినిమా సక్సెస్ మీట్‌లో యాంకర్ సుమ విజ‌య్ త‌ల్లిదండ్రుల‌ను కొన్ని ప్ర‌శ్న‌లు వేసింది. ఆ స‌మ‌యంలో స్టేజ్‌పై విజ‌య్ కూడా ఉన్నారు. తమకు రాబోయే కోడలి గురించి విజయ్ తల్లిదండ్రులు ఆ వీడియోలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఒకటి రెండు కండిషన్స్ కూడా పెట్టారు. మీకు ఎలాంటి కోడలు రావాలని మీరు కలలు కంటున్నారని విజ‌య్ త‌ల్లి మాధవిని సుమ ప్ర‌శ్నించింది. అందుకు ఆమె బ‌దులిస్తూ.. కోడ‌లి విష‌యంలో తనకు ఒకే ఒక కండిషన్ ఉందని చెప్పింది. మా బాబుని మంచిగా చూసుకునే కోడలు వస్తే చాలు అని తెలిపింది. విజ‌య్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి అతన్ని బాగా అర్థం చేసుకునే అమ్మాయి వ‌స్తే చాలు అంటూ చెప్పుకొచ్చింది.

ఇక అదే సమయంలో విజయ్ తండ్రి గోవర్ధన్ రావు కూడా కోడ‌లి గురించి మాట్లాడారు. విజ‌య్ త‌న‌కు న‌చ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. కోడ‌లి విష‌యంలో త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రాలు, ప‌ట్టింపులూ లేవ‌ని స్ప‌ష్టం చేశారు. అమ్మాయి ఓ భార‌తీయురాలు, ముఖ్యంగా సౌత్ ఇండియ‌న్ అయితే త‌న‌కు సంతోష‌మ‌ని చెప్పుకొచ్చారు. ఆ పాత వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి :

Udaypur | విజయ్–రష్మిక రాయల్ వెడ్డింగ్ సందడి.. ఉదయ్‌పూర్‌కి చేరుకుంటున్న సెల‌బ్రిటీలు
Teacher Assaults 30 Students | ఎంత దారుణం.. బైక్‌ను పాడుచేశార‌న్న నెపంతో 30 మంది విద్యార్థుల్ని చిత‌క‌బాదిన‌ టీచ‌ర్

Latest News