• Telugu News
  • /National

Teacher Assaults 30 Students | ఎంత దారుణం.. బైక్‌ను పాడుచేశార‌న్న నెపంతో 30 మంది విద్యార్థుల్ని చిత‌క‌బాదిన‌ టీచ‌ర్

త‌న బైక్‌ను పాడుచేశార‌న్న నెపంతో ఓ ఉపాధ్యాయుడు (Maharashtra Teacher) దాదాపు 30 మంది విద్యార్థుల‌ను చిత‌క్కొట్టాడు. అత‌డి కొట్టుడికి విద్యార్థుల (Students) శరీరంపై వాతలు తేలాయి.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 24, 2026, 3:47 pm IST
Read Time: 4 mins
Teacher Assaults 30 Students | ఎంత దారుణం.. బైక్‌ను పాడుచేశార‌న్న నెపంతో 30 మంది విద్యార్థుల్ని చిత‌క‌బాదిన‌ టీచ‌ర్ Operation Octopus: Hyderabad Police Bust ₹127 Crore Pan-India Cyber Fraud Network, 104 Arrested

Teacher Assaults 30 Students| విద్యార్థుల‌పై టీచ‌ర్లు త‌మ ప్ర‌తాపాన్ని చూపుతున్నారు. చ‌దువ‌డం లేద‌నో, హోంవ‌ర్క్ చేయ‌ట్లేద‌నో, క్లాస్‌లో అల్ల‌రి చేస్తున్నారో.. ఇలా ప‌లు కార‌ణాల‌తో చేయి చేసుకుంటున్నారు. ఇటీవ‌లే హోం వర్క్ చేయ‌లేద‌ని చెప్పి రెండో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థిని ఓ టీచ‌ర్ దారుణంగా కొట్టిన విష‌యం తెలిసిందే. తాజాగా త‌న బైక్‌ను పాడుచేశార‌న్న నెపంతో ఓ ఉపాధ్యాయుడు (Maharashtra Teacher) దాదాపు 30 మంది విద్యార్థుల‌ను చిత‌క్కొట్టాడు.

మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్ హాస్ట‌ల్‌లో ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ రాత్రి ఈ సంఘటన జరిగింది. విద్యార్థుల‌కు ఆరోజు రాత్రి ఉపాధ్యాయుడు ఉజ్వ‌ల్ ప్ర‌కాశ్ సోనీ క్లాస్ తీసుకున్నాడు. నైట్‌ స్టడీ తర్వాత విద్యార్థులు తమ హాస్టల్‌కు వెళ్తున్నారు. టీచ‌ర్ సైతం ఇంటికి వెళ్లేందుకు రెఢీ అయ్యాడు. ఈ క్ర‌మంలో త‌న బైక్ వ‌ద్ద‌కు వెళ్ల‌గా.. నంబ‌ర్ ప్లేటు వంగి (Bent Motorcycle Number Plate) ఉండ‌టాన్ని గ‌మ‌నించాడు. అంతేకాదు బైక్ కూడా స్టార్ట్ కాలేదు. దీంతో టీచ‌ర్‌కు ప‌ట్ట‌రాని కోసం వ‌చ్చింది.

ఇది విద్యార్థుల ప‌నే అని భావించిన ఉపాధ్యాయుడు.. విద్యార్థులను పిలిచి తన బైక్‌ పాడు చేసింది ఎవరని ప్రశ్నించాడు. అయితే, విద్యార్థుల నుంచి సమాధానం రాలేదు. దీంతో స‌హ‌నం కోల్పోయిన టీచ‌ర్ వెదురు క‌ర్ర‌తో విద్యార్థుల‌పై దాడి చేశాడు. టీచ‌ర్ దాడిలో సుమారు 30 మంది విద్యార్థుల శరీరంపై వాతలు తేలాయి. ఇక ఈ విష‌యం స్కూల్ ప్రిన్సిప‌ల్ వ‌ర‌కూ చేరింది. దీంతో ఆయ‌న టీచ‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకున్నాడు. టీచర్‌ను సస్పెండ్ చేసి పోలీసులకు అతడ్ని అప్పగించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Anthropic AI Impact | ఐటీ కంపెనీ షేర్లకు ఆంత్రోపిక్ ఏఐ గండం.. ఐబీఎం షేర్లు 13.2 శాతం ఢమాల్
Rajya Sabha Elections | రాజ్యసభ బరిలో బీఆర్ఎస్ అభ్యర్థి.. ఫిరాయింపుదారులకు చెక్ పెట్టేందుకేనా! ఇదీ లెక్కల చిక్కు!