Vijay Devarakonda | అభిమానుల మధ్య ఘనంగా విజయ్ దేవరకొండ బర్త్‌డే సెలబ్రేషన్స్.. రష్మికతో కలిసి కనిపించిన స్టార్ హీరో!
Vijay Devarakonda | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నేడు తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే #HappyBirthdayVijayDeverakonda హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుండగా, అభిమానులు, సినీ ప్రముఖులు, నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈసారి విజయ్ బర్త్‌డే మరింత స్పెషల్‌గా మారింది.
Vijay Devarakonda | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నేడు తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే #HappyBirthdayVijayDeverakonda హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుండగా, అభిమానులు, సినీ ప్రముఖులు, నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈసారి విజయ్ బర్త్‌డే మరింత స్పెషల్‌గా మారింది. ఇటీవల రష్మిక మందన్నాతో వివాహం అనంతరం విజయ్ జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు కావడంతో అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపించింది.హైదరాబాద్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి విజయ్ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నారని తెలిసిన వెంటనే అభిమానులు భారీగా ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. వందలాది మంది అభిమానులు కేక్‌లు, ఫ్లెక్సీలు, పూల బొకేలు తీసుకుని హీరోకు శుభాకాంక్షలు చెప్పేందుకు తరలివచ్చారు. అభిమానుల సందడి చూసిన విజయ్.. ఇంటి మేడపైకి వచ్చి వారికి అభివాదం చేశారు.
ఈ సందర్భంగా విజయ్‌తో పాటు రష్మిక కూడా కనిపించడం అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. విజయ్ తల్లి కూడా వారితో కలిసి అభిమానులకు చేతులు ఊపుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ క్యూట్ ఫ్యామిలీ మూమెంట్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విజయ్, రష్మిక కలిసి అభిమానులకు అభివాదం చేస్తున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.అంతేకాదు, అభిమానులు ప్రత్యేకంగా తీసుకొచ్చిన కేక్‌ను కట్ చేయడానికి విజయ్ స్వయంగా కిందకు వచ్చారు. అభిమానుల మధ్య నిలబడి కేక్ కట్ చేసిన ఆయన.. వారితో కాసేపు సరదాగా మాట్లాడారు. అభిమానుల నుంచి శుభాకాంక్షలు స్వీకరించి, ఫోటోలు కూడా దిగారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. “హ్యాపీ బర్త్‌డే అన్నా” అంటూ అభిమానులు నినాదాలు చేయడంతో ఆ ప్రాంతం మొత్తం మార్మోగిపోయింది.
విజయ్ అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసిన ఈ బర్త్‌డే వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “స్టార్ అయినా అభిమానులను మర్చిపోడు”, “విజయ్ డౌన్ టు ఎర్త్ పర్సన్” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు రష్మికతో కలిసి కనిపించిన ఈ క్యూట్ కపుల్ ఫోటోలు కూడా ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాయి.ఇక సినిమాల విషయానికి వస్తే, విజయ్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అభిమానులు కూడా ఆయన కొత్త సినిమాల అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బర్త్‌డే సందర్భంగా కొత్త పోస్టర్లు, టీజర్లు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
#VijayDeverakonda joins his fans for a special cake cutting as a massive crowd gathers at his residence.🔥#HBDVijayDeverakonda pic.twitter.com/V3I1b5bMyM
— PRO Sreenu Suresh (@ProSreenuSuresh) May 9, 2026
My Babies here❤️😮💨🤗@iamRashmika@TheDeverakonda
— THE RWDY🗿X (@TheDEVERA_fan) May 9, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram