CPI Narayana: మహిళలు.. ఉత్పత్తి పరిశ్రమలా?

CPI Narayana| విధాత: మహిళలు ఉత్పత్తి పరిశ్రమలా? అని సీపీఐ జాతీయ నేత కే.నారాయణ ప్రశ్నించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన నారాయణ వస్థీకృత హింసలకు మహిళలే సమిధలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మహిళలు ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలన్నారు. అలాగే కొంత మంది రాజకీయ నాయకులు, పాలకులు ఎక్కువ మంది పిల్లల్ని కనమని అనడం రాజకీయ దివాలాకోరు తనమేనని విమర్శించారు. మహిళలు ఏమైనా పరిశ్రమలకు ఉత్పత్తి సాధనాలా ?అని మండిపడ్డారు. […]

CPI Narayana|

విధాత: మహిళలు ఉత్పత్తి పరిశ్రమలా? అని సీపీఐ జాతీయ నేత కే.నారాయణ ప్రశ్నించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన నారాయణ వస్థీకృత హింసలకు మహిళలే సమిధలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మహిళలు ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలన్నారు. అలాగే కొంత మంది రాజకీయ నాయకులు, పాలకులు ఎక్కువ మంది పిల్లల్ని కనమని అనడం రాజకీయ దివాలాకోరు తనమేనని విమర్శించారు. మహిళలు ఏమైనా పరిశ్రమలకు ఉత్పత్తి సాధనాలా ?అని మండిపడ్డారు.

ఇటీవల కాలంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సీఎంలు సహా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎక్కువ మంది పిల్లలు కనాలని..కుటుంబ నియంత్రణ అవసరం తీరిపోయిందని పిలుపునిస్తున్నారు. జనాభాలో వైరుద్యాల నివారణ కోణంలో ఒకరు..దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించి నష్టపోయాయని మరొకరు.. మత పరమైన కోణంలో మెజార్టీ వర్గం జనాభా తగ్గిపోతున్నందునా ఎక్కువ మంది పిల్లలను కనాలని ఇంకోపార్టీ నాయకులు ఇటీవల పలు సందర్భాల్లో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అధిక సంతానం పిలుపు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Latest News