OTT | Theater: ఈవారం ఓటీటీ, థియేట‌ర్ల‌లో వ‌చ్చే సినిమాలివే! ఓటీటీలో ఆ మూడు మాత్రం చాలా స్పెష‌ల్‌

  • Publish Date - March 19, 2025 / 07:14 PM IST

OTT | Theater

విధాత‌: తెలుగు రాష్ట్రాల్లో ప‌ది ప‌రీక్ష‌లు, అద‌ర‌గొడుతున్న ఎండ‌ల నేప‌థ్యంలో భారీ, పెద్ద హీరోల‌ సినిమాలేవి థియేట‌ర్ల వైపు వ‌చ్చేందుకు స‌పుముఖంగా లేవు. ఈక్ర‌మంలో చాలావ‌ర‌కు చిన్న సినిమాలే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు పోటీ ప‌డుతున్నాయి. అదీగాక రెండు మూడు రోజుల్లో ఐపీఎల్ సైతం ప్రారంభం అవుతుండ‌డంతో డ‌జ‌న్‌కు పైగా సినిమాలు థియేట‌ర్ల బాట ప‌ట్టాయి. వీటిలో ఒక్క తెలుగులోనే 12 చిత్ంరాలు ఉండ‌గా హిందీ నుంచి 4, ఇంగ్లీష్ నుంచి రెండు సినిమాలు విడుద‌ల అవ‌దుతున్నాయి. తెలుగులో రిలీజ్ అవుతున్న సినిమాల‌లో ఆది సాయికుమార్ ష‌ణ్ముక‌, స‌ప్త‌గిరి పెళ్లికాని ప్ర‌సాద్‌, న‌వీన్ చంద్ర 28 డిగ్రీ సెల్సియ‌స్ మిన‌హా అన్ని కొత్క‌త న‌టుల సినిమాలే ఉన్నాయి. అదేవిధంగా నాని, విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం చిత్రం విడుద‌లై 10 యేండ్లు అవుతున్న సంద‌ర్భంగా ఈ సినిమాను తిరిగి భారీగా రీ రిలీజ్ చేస్తున్నారు.

ఇక ఓటీటీల్లోనూ ఈ వారం సినిమాల సంద‌డి భారీగానే ఉండ‌నుండ‌గా వాటిలో అధిక శాతం డ‌బ్బింగ్ చిత్రాలు ఉండ‌డం విశేషం, ముఖ్యంగా ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించిన ప్ర‌దీప్ రంగ‌నాథ్ న‌టించిన‌ రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌, ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జాబిల‌మ్మ నీకు అంత కోప‌మా వంటి త‌మిళ మూవీస్‌తో మ‌ల‌యాళం నుంచి కుంచ‌కోబోబ‌న్ న‌టించిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ ఆఫీస‌ర్ ఆన్ డ్యూటీ స్ట్రీమింగ్ అవ‌నున్నాయి. ఖాకీ బెంగాల్ ఛాఫ్ట‌ర్ వంటి సిరీస్‌లు తెలుగులో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. వీటితో పాటు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు బ్ర‌హ్మాఆనందం, జితేంద‌ర్ చిత్రాలు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. ఇదిలాఉండ‌గా ఇటీవ‌ల ఈస్కార్స్ అవార్డుల‌లోప్ర‌భంజ‌నం సృష్టించిన హాలీవుడ్ బోల్డ్ మూవీ అనోరా సైతం స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

ఈవారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చే సినిమాలివే

Telugu

Artiste (ఆర్టిస్ట్‌) Mar 21
Tuk Tuk (టుక్ టుక్)Mar 21
Shanmukha  (ష‌ణ్ముక‌) Mar 21


The Suspect  (ది స‌స్పెక్ట్‌) Mar 21
Kiss Kiss Kissik  (కిస్ కిస్ కిస్సిక్‌) Mar 21
Pelli Kani Prasad (పెళ్లి కాని ప్ర‌సాద్‌) Mar 21


28 Degree Celsius (28 డిగ్రీ సెల్సియ‌స్‌) Mar 21
Raju Gari Dongalu (రాజు గారి దొంగ‌లు) Mar 21
O Andala Rakshasi (ఓ అందాల రాక్ష‌సి) Mar 21
Anaganaga Australia Lo  (అన‌గ‌న‌గా ఆస్ట్రేలియాలో)Mar 21
Kaalamega Karigindhi..? (కాల‌మేగా క‌రిగింది) Mar 21

Hindi

Pintu Ki Pappi Mar 21
Snow White
Baida
Tumko Meri Kasam

English

Snow White
Locked

ఈ వారం ఓటీటీ సినిమాలివే

Netflix (నెట్‌ఫ్లిక్స్‌)

Crime Patrol: City Crime S8 Now Streaming
SkiInto Love S1 Chinese series Now Streaming
బెట్‌ యువర్‌ లైఫ్‌ (వెబ్‌సిరీస్‌) Now Streaming
ఖాకీ: ది బెంగాల్‌ ఛాప్టర్‌ (వెబ్‌సిరీస్‌) Tel, Tam Now Streaming
Officer On Duty (ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ) Tel, Tam Now Streaming


The Twister (Documentary) English, Hindi Now Streaming
Woman Of The Dead విమెన్‌ ఆఫ్‌ ది డెడ్‌ 2 (వెబ్‌సిరీస్‌) Now Streaming
Dragon (రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌)  Tel, Tam Mar 21
Littile Syberia (లిటిల్‌ సైబీరియా) Mar 21

Prime Video
IAm Kathalan Malayalam Now Streaming
NEEK (జాబిల‌మ్మ అంత కోప‌మా) Tel, Tam Mar 21
Twilight Of The Warriors Mar 27


Jio Hotstar (జియో హాట్‌స్టార్‌)

Anora అనోరా (ఆస్కార్‌ విన్నర్‌) Now Streaming
Muslim Matchmaker S1
Rules Of Engagement S1 (2007), Now Streaming
No Escape S1 (2023) Now Streaming


Touch Me Not
Mufasa The Lion King Eng, Hin, Tel, Tam March 26

ETV Win (ఈటీవీ విన్‌)

Jithender Reddy జితేందర్‌ రెడ్డి: March 20

Aha (ఆహా)
Brahma Anandam బ్రహ్మాఆనందం: March 20