Site icon vidhaatha

Adolescence: OTTలో.. రికార్డులు తిర‌గ‌రాస్తున్న‌ ‘అడాలసెన్స్‌’! తెలుగులోనూ స్ట్రీమింగ్‌

Adolescence

విధాత: నెట్ ప్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ‘అడాలసెన్స్‌’ అత్యధిక వ్యూవర్స్ షిప్ సాధించిన సిరీస్ జాబితాల్లో టాప్ లో నిలిచింది. ఇప్పటివరకూ 96.7 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. దీంతో నిన్నటిదాక టాప్ లో కొనసాగుతోన్న స్ట్రేంజర్ థింగ్స్ 3 (94.8), బ్రిడ్జర్టన్ సీజన్ 2 (93.8) వ్యూస్ రికార్డులను ‘అడాలసెన్స్‌’ అధిగమించింది. నెట్ ప్లిక్స్ స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి ‘అడాలసెన్స్‌’ మంచి ప్రేక్షకాదరణతో పాటు విమర్శల ప్రశంసలు పొందింది.

ఇప్పటివరకూ నెట్ ప్లిక్స్ లో ఆల్ టైమ్ మోస్ట్ పాపులర్ సిరీస్ జాబితాలో ‘స్క్విడ్ గేమ్’ టాప్ లో ఉంది. మరికొన్ని రోజుల్లోనే దీన్ని ‘అడాలసెన్స్‌’ అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మార్చి 24 నుంచి 30 వరకు ఈ సిరీస్ 30 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించి ఇంగ్లిష్ సిరీస్ లిస్టులో టాప్ వన్ లో కొనసాగుతోంది. ‘అడాలసెన్స్‌’ సిరీస్ 93 దేశాల్లో టాప్ లో కొనసాగడం విశేషం. సాధారణంగా 91 రోజుల్లో వచ్చిన వ్యూస్ ఆధారంగా నెట్ ప్లిక్స్ పాపులర్ సిరీస్ జాబితాను సిద్ధం చేస్తుంది. ‘అడాలసెన్స్‌’ విడుదలైన 17 రోజుల్లోనే 96.7 మిలియన్ వ్యూస్ లతో ఈ లిస్టులో తొమ్మిదో స్థానంలో నిలిచింది. మరికొన్ని రోజుల్లోనే నంబర్1 చేరుకునే అవకాశం కనిపిస్తోంది.

అసలేంటి ‘అడాలసెన్స్‌’ కథ?

కేటీ (ఎమీలియా) అనే బాలిక స్కూల్ పరిసరాల్లో దారుణ హత్యకు గురవుతుంది. శరీరంపై ఏడు కత్తిపోట్లు ఉంటాయి. ఈ హత్యా నేరం కింద 13 ఏళ్ల జామీని (ఓవెన్ కూపర్) పోలీసులు అరెస్టు చేస్తారు. అనంతరం అతడిని విచారించడం మొదలు పెడతారు. మరి జామీ నిజంగా హత్య చేశాడా? అందుకు ఏదైనా బలమైన కారణం ఉందా? హత్యానేరం నిరూపణ అయిందా? అన్నది ఇతివృత్తం. కాగా నెట్‌ఫ్లిక్స్‌లో ‘అడాలసెన్స్‌” తెలుగులోనూ స్ట్రీమింగ్‌ అవుతోంది. సామాన్య తల్లిదండ్రుల నుంచి దేశాధినేతల వరకూ ఈ సిరీస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘నా ఇద్దరు పిల్లలతో కలిసి ‘అడాలసెన్స్‌’ చూశానని సాక్షాత్తూ బ్రిటన్‌ ప్రధాని కీర్ స్టార్మర్ ఇటీవల వెల్లడించారు. బ్రిటన్ లోని అన్ని పాఠశాలల్లో ఈ వెబ్ సిరీస్ ను ప్రదర్శించాలని కీలక నిర్ణయం కూడా ఆయన తీసుకున్నారు. దీంతో ‘అడాలసెన్స్‌’ కు మరింత క్రేజ్ పెరిగిపోయింది.

Exit mobile version