Site icon vidhaatha

Phone Tapping Case | కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ కు సిట్ నోటీసులు

bandi-sanjay-phone-tapping-case

Phone Tapping Case | విధాత : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ () కి సిట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 24న ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్మెంట్ ఇవ్వాలని కోరారు. సిట్ నోటీసులపై బండి సంజయ్ సానుకూలంగా స్పందించారు. ఈనెల 24న విచారణకు హాజరయ్యేందుకు సంసిద్దత వ్యక్తం చేశారు. హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో బండి సంజయ్ ని సిట్ అధికారులు విచారించి స్టేట్మెంట్ నమోదు చేసుకోనున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు బాధితుల్లో అన్ని పార్టీల నేతలు, గవర్నర్లు, హైకోర్టు జడ్జిలు, సినీ, మీడియా, ఫార్మా, ఐటీ ప్రముఖులు ఉన్నారు. దాదాపు 4,200కు పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఇందులో 2023, నవంబర్‌లో దాదాపు 618 మంది రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేశారు. వారిలో 239మందికి పైగా స్టేట్మెంట్ నమోదు చేశారు. తాజాగా తీన్మార్ మల్లన్నకు కూడా సిట్ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.

Exit mobile version