BJP MP Raghunandan Rao | విధాత, హైదరాబాద్ : బీజేపీ ఎంపీ రఘునందన్ రావును హతమారుస్తామంటూ పదేపదే వస్తున్న బెదిరింపు కాల్స్ కేసును తెలంగాణ డీజీపీ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు బదిలీ చేశారు. గత జూన్ నుంచి మావోయిస్టుల పేరుతో రఘునందన్ ను చంపేస్తామంటూ వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తనకు వస్తున్న బెదిరింపు కాల్స్ పై ఎంపీ రఘునందన్ రావు నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును సైబర్ సెక్యూరిటీ బ్యూరో కు బదిలీ చేస్తూ డీజీపీ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి…