Eatala Rajendar | మీడియాను, సోషల్ మీడియాను నమ్ముకోలేదు : ఎంపీ ఈటల

పంటలు చేతికి వచ్చినా కానీ కాంటాలు లేవు.. మిల్లుల్లో రోజుల తరబడి ధాన్యం దింపుకోకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. క్వింటాల్ వడ్లకు 8 కిలోల తరుగు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Eatala Rajender

విధాత, హైదరాబాద్ :
పంటలు చేతికి వచ్చినా కానీ కాంటాలు లేవు.. మిల్లుల్లో రోజుల తరబడి ధాన్యం దింపుకోకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. క్వింటాల్ వడ్లకు 8 కిలోల తరుగు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జమ్మికుంటలో నిర్వంచించి ప్రెస్ మీట్ లో ఈటల మాట్లాడారు. ప్రభుత్వం సన్న వడ్లకు ఐదువందల రూపాయల బోనస్ ఇస్తా అన్నది.. ఇంకా అందరికీ అందలేదు ఈసారి అయినా ప్రతి రైతుకు అందించాలని ఈటల కోరారు. రెండు లక్షల రుణమాఫీ కూడా ఇంకా పెండింగ్ లో ఉందని గుర్తుచేశారు. వర్షాలు, తుఫానుతో నష్టపోయిన రైతులకు ప్రకటించిన 10 వేలు వెంటనే ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు.

పత్తి విషయంలో కూడా నాన్చకుండా కొనుగోళ్లు చేయాలని.. 7 క్వింటాళ్ల నిబంధన లేకుండా కొనుగోళ్లు చేయాలని కోరారు. సీసీఐ కూడా వర్షం వల్ల నష్టపోయినందునా నిబంధనలు సడలించాలన్నారు. ఫసల్ బీమా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తే రైతులకు ఇబ్బంది ఉండేది కాదన్నారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికలపై ఈటల స్పందిస్తూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో అత్యధిక వార్డు మెంబర్స్, సర్పంచులను, ఎంపీటీసీ,ఎంపీపీ, జీపీటీసీలను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వీరంతా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉంటారని.. వారికి ఉన్నంత అవగాహన మాకు కూడా ఉండదన్నారు. ఎమ్మెల్యేగా గెలవాలి అంటే వీరి పాత్ర కీలకం అని చెప్పారు.

ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికలకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని తెలిపారు. 107 గ్రామ పంచాయతీలలో మెజారిటీతో గెలిచే సత్తా మాకే ఉందన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎలా కష్టపడ్డానో ఇప్పుడు కూడా అంతే కష్టపడి గెలిపించుకుంటామని తెలిపారు. త్వరలోనే నాయకులు కార్యకర్తలందరితో స్ట్రాటజీ మీటింగ్ ఏర్పాటు చేస్తామని ఈటల తెలిపారు. ‘సర్పంచ్ లను గెలిపించుకొనే భాద్యత నాది. నేను ఇక్కడికి వచ్చాక గత 20 ఏళ్లలో జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ ఓడిపోయింది లేదు. 80 శాతం సర్పచులు మావే. ప్రతి ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిపించుకున్నాం. నేను మీడియాను, సోషల్ మీడియాను నమ్ముకున్న వాడిని కాదు. ప్రజలను, ధర్మాన్ని, పనిని నమ్ముకున్న వాడిని. 25 ఏళ్లు ఇలానే బతికిన. ఉన్నదాన్నే చెప్పుకునే తెలివి లేని వాళ్ళం’ అని అన్నారు.

Latest News