విధాత : తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు సైకిల్ ఎక్కి తమ సరాదా తీర్చుకున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణల సైకిల్ సంబురాల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం ఖమ్మం జిల్లా కూసుమంచిలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించి, విద్యార్థినిలకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఓ బాలిక సైకిల్ తీసుకుని ఆమెను వెనుక కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కారు. బాలికల సైకిల్ కావడంతో బ్యాలెన్స్ చేసుకోవడంలో కొంత ఇబ్బంది పడ్డారు. గతంలో మున్నేరు వరద ప్రాంతాలలో పర్యటించిన సందర్భంగా వరద నీటిలో బైక్ పై వెలుతుండగా బైక్ కింద పడి దాని రాడ్ గుచ్చుకుని పొంగులేటి గాయపడ్డారు. అయితే ఈ దఫా సైకిల్ సరదా మాత్రం సాఫీగానే పూర్తి చేశారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం అధివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఏర్పడ్డాక రూ.470 కోట్లతో కళాశాలలు, పాఠశాలలు మంజూరు చేశామన్నారు. విద్యార్థులు ఉన్నతంగా రాణించాలని సూచించారు.
ఇక సీనియర్ హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పార్లమెంటు ఆవరణలో సైకిల్ తొక్కి సందడి చేశారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తాను ప్రతి రోజు పార్లమెంటుకు సైకిల్‌పై వస్తానని.. దాన్ని బాలకృష్ణకు చూపించారు. బాలయ్య ఆ సైకిల్‌పై ఎక్కి కాసేపు సందడి చేశారు. అనంతరం ఆయన పార్టీ ఎంపీలతో కలిసి స్పీకర్ ఓంబిర్లాతో సమావేశమయ్యారు. తర్వాత కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. తన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై వినతులు అందజేశారు.
పార్లమెంటు ఆవరణలో సైకిల్ ఎక్కి సందడి చేసిన బాలయ్య
నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పార్లమెంటు ఆవరణలో సందడి చేశారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తాను ప్రతి రోజు పార్లమెంటుకు సైకిల్‌పై వస్తానని.. దాన్ని బాలకృష్ణకు చూపించారు. బాలయ్య ఆ సైకిల్‌పై ఎక్కి కాసేపు సందడి… pic.twitter.com/rS75YMf87E
— ChotaNews App (@ChotaNewsApp) July 31, 2025