Site icon vidhaatha

కేటీఆర్ సభలో ‘రప్పా రప్పా’ పోస్టర్లు

rapparappa-posters-controversy-in-ktr-khammam-meeting

విధాత : రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప’ రప్పా రప్పా డైలాగ్‌ల(Rappa Rappa dailogue) వ్యవహారం వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఖమ్మం(Khammam) బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సభలోనూ ఈ ‘రప్పా రప్పా’ పోస్టర్లు కలకలం సృష్టించాయి. బీఆర్ ఎస్ 3.0లోడింగ్..‘2028లో రప్పా రప్పా.. కాంగ్రెస్ నాయకులకు మిత్తితో సహా చెల్లిస్తాం’’ అని పోస్టర్లపై రాసుకొచ్చారు.
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తదితర నేతలతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district) కరకగూడెం చేరుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులు రప్పా రప్పా ఫ్లెక్సీ(Rappa Rapp Flexi) ఏర్పాటు చేశాయి.

కాగా రప్పారప్పా ఫ్లెక్సీ(Rappa Rapp Flexi) వ్యవహారం ఏపీ రాజకీయాల నుంచి తెలంగాణకు దిగుమతి అయ్యింది. ఏపీలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్.జగన్ పర్యటనలో రప్పారప్పా ఫ్లెక్సీ వివాదం ఆ రాష్ట్ర రాజకీయాల్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్య మాటల మంటలు రగిలించింది. ఆ తర్వాతా సిద్దిపేటలో హరీష్ రావు పర్యటనలో, సూర్యాపేటలో జి.జగదీష్ రెడ్డి పర్యటనలో రప్పారప్పా ఫ్లెక్సీలు కనిపించాయి. ఇప్పుడు ఖమ్మం జిల్లా కేటీఆర్ పర్యటనలో రప్పా రప్పా డైలాగ్‌ల పోస్టర్ సందడి చేసింది. సిద్ధిపేటలో హరీష్ రావు పర్యటనలో ‘రప్పారప్పా‘ ఫ్లెక్సీలపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ అటువంటి ప్లెక్సీలతో షో చేస్తే భయపడే వారు ఎవరూ లేరని కౌంటర్ వేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు ఆయన సొంత జిల్లాలనే రప్పారప్పా ప్లెక్సీలు ప్రదర్శించడం గమనార్హం.

Exit mobile version