విజయనగరం:వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి కేంద్ర మాజీ మంత్రివర్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు కౌంటర్ ఇచ్చారు.
విజయసాయి జ్ఞానం పెంచుకోవాలని సూచించారు.
నెల్లిమర్లలో ఆలయాన్ని శుక్రవారం దర్శించిన అనంతరం మీడియాతో అశోక్ గజపతి మాట్లాడుతూ ఆయన్ను హత్య చేయటానికి సిద్ధపడ్డానని తనపై ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.హిందూమతంపై దాడులను నిరోధించాలని విజ్ఞప్తి చేశారు.రామతీర్థం విగ్రహ విధ్వంసకులను పట్టుకున్న దాఖలాలు లేవు న్యాయాన్ని,ధర్మాన్ని కాపాడాలని కోరారు. రాముడి విగ్రహం శిరస్సు తొలగించినవారిని ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు.
చీకటి జీవోలతో తనను తొలగించిన ప్రభుత్వానిదే తప్పు అమలుచేసిన అధికారులది, సిబ్బంది తప్పు లేనే లేదన్నారు.ఇప్పటికైనా దాడుల సంస్కృతిని ప్రభుత్వం మానుకోవాలని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు.
Read more:అశోక్‌గజపతిరాజు జైలుకెళ్లడం తప్పదు: విజయసాయిరెడ్డి