న్యూఢిల్లీ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)న్యూఢిల్లీలో బుధవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh)తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, రక్షణ శాఖ భూ బదలాయింపుల(defence land transfer)పై సహకరించాలని రేవంత్ రెడ్డి ఈ సందర్బంగా రాజ్ నాథ్ సింగ్ ను కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని విన్నవించారు.
మూసీ… ఈసీ నదుల సంగమం సమీపంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ(Gandhi Circle of Unity), నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు రక్షణ శాఖ మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలియచేశారు. జాతీయ సమైక్యత…. గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్(Gandhi Sarovar Project) నిలుస్తుందని కేంద్ర మంత్రికి వివరించారు. ఎలివేట్ కారిడార్లు(Elevated Corridors) సహా ఇతర నిర్మాణాలకు రక్షణ శాఖ భూములను వెంటనే బదిలీ చేయాలని కోరారు. సైనిక్ స్కూల్స్ ఏర్పాటుపై చర్చించారు. సీఎం వెంట తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారు.