కేటీఆర్, కవితపై సీఐడీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన అక్రమాల వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సీఐడీకి ఫిర్యాదు చేసింది. సీఐడీ ఆడిషన్ డీజీ చారుసిన్హాను కలిసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు హెచ్ సీఏలో అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని ఫిర్యాదు చేసింది. హెచ్ సీఏ ఎన్నికల్లోకి హఠాత్తుగా జగన్మోహన్ రావు రావడం వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని ఆరోపించింది. హెచ్ […]

Ktr-kalvakuntla-kavitha-Jagan-mohan-rao-HCA

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన అక్రమాల వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సీఐడీకి ఫిర్యాదు చేసింది. సీఐడీ ఆడిషన్ డీజీ చారుసిన్హాను కలిసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు హెచ్ సీఏలో అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని ఫిర్యాదు చేసింది. హెచ్ సీఏ ఎన్నికల్లోకి హఠాత్తుగా జగన్మోహన్ రావు రావడం వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని ఆరోపించింది.

హెచ్ సీఏ ప్రెసిడెంట్ గా జగన్మోహన్ రావు గెలవగానే.. నా విజయం కేటీఆర్, కవిత, హరీష్ రావుకి అంకితం అని చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఐపీఎల్ టికెట్ కాంట్రాక్టును కేటీఆర్ బంధువు రాజ్ పాకాల సంస్థలకు కేటాయించారని ఆరోపించారు. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఆహార ఒప్పందాలు వంటి అనేక ఇతర విక్రయాల కాంట్రాక్టులను కేటీఆర్, కవితల బందువు అయిన సురభి క్యాటరర్స్‌కు ఇచ్చారని పేర్కొన్నారు. ట్రావెల్స్ కాంట్రాక్ట్, హోటల్ బుకింగ్స్, ఈవెంట్‌లు కూడా వారి బంధువులకే కేటాయించారని ఫిర్యాదులో ఆరోపించారు. కవితతో పాటు హెచ్ సీఏలో ఉన్న మరికొందరు అక్రమార్కులపై కూడా దర్యాప్తు చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సీఐడీని కోరింది.