Dog Robo Delivery : డెలివరీ చేసే డాగ్ రోబో.. డెలివరీ బాయ్స్ భవిష్యత్తు ఎట్లా!

డెలివరీ పనుల్లోకి ప్రవేశించిన డాగ్ రోబోలు అమెరికాలో వైరల్. వేగంగా వస్తువులు అందించే వీటి వల్ల భవిష్యత్తులో డెలివరీ బాయ్స్ ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందనే ఆందోళనలు.

Dog Robo Delivery

విధాత: రోబోలు, ఏఐ రోబోల పలు రంగాల్లో మనుషుల కంటే గొప్పగా పనిచేస్తు వారి ఉద్యోగాలకు ఎసరు పెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బోధన, వ్యవసాయం, మీడియా, శాస్త్ర సాంకేతిక పరిశోధనల రంగాలతో పాటు సముద్రాలు, పర్వతాలు, గనుల రంగాల్లోని పలు పనుల నిర్వహణలో రోబోల సేవలు విస్తరించబడ్డాయి. తాజాగా ట్రాఫిక్ విధుల్లోనూ చైనాలో రోబోలు రంగప్రవేశం చేశాయి. ఇదంతా బాగానే ఉన్నా తాజాగా డెలివరీ బాయ్స్ గా కూడా రోబోలు పనిచేస్తుండటం నిరుద్యోగులను పరేషాన్ చేస్తుంది.

అమెరికాలోని పిట్స్‌బర్గ్ నగరంలో ఆర్ఐవీఆర్( ‘RIVR’) అనే సంస్థ వస్తువుల డెలివరీ కోసం డాగ్ రూపంలో ఉండే ఒక ప్రత్యేక రోబోను ప్రవేశపెట్టింది. దీనికుండే వీల్స్‌తో వేగంగా లోకేషన్‌కు చేరుకొని, మెట్లను సైతం ఎంతో ఈజీగా ఎక్కుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మనుషుల కంటే వేగంగా డెలివరీ రోబో డాగ్ నిర్ధేశిత ప్రాంతానికి చేరుకుని డెలివరీ వస్తువులు అందిస్తుండం గమనార్హం. దీని దూకుడు చూస్తే..డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకు భవిష్యత్తులో ఎసరు పెట్టేదిగా కనిపిస్తుందని నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెట్టారు. అసలే అమెజాన్, స్విగ్గీ, జఫ్టో, జమాటో వంటి ఆన్ లైన్ సంస్థలలో లక్షలాది మంది డెలవరీ బాయ్స్ పనిచేస్తున్నారు. డెలివరీ డాగ్స్ ప్రయోగాలు విజయవంతమైతే..డెలివరీ బాయ్స్ స్థానంలో అవి రంగప్రవేశం చేస్తే మాత్రం వారి ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డేట్టేనంటున్నారు.

ఇవి కూడా చదవండి :

UP Woman Marries Lord Krishna Idol : శ్రీకృష్ణుడి విగ్రహంతో యువతి పెళ్లి వైరల్
Sequels | ముగింపు దశకు చేరుకున్న 2025… సీక్వెల్ సినిమాల పరాజయాలపై పెద్ద చర్చ!

Latest News