Dubai AI Powered Barber Pod : AI మాయాజాలం.. క్షణాల్లోనే క్షౌరం

క్షణాల్లోనే హెయిర్‌స్టైల్ చేస్తోందని చెప్పిన ‘AI బార్బర్ పాడ్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్. అయితే అది అసలు వీడియో కాకుండా డీప్‌ఫేక్ అని బయటపడింది.

Dubai AI Powered Barber Pod

AI వచ్చాక ఏపనైనా అసాధ్యం కాదు.. అన్ని సాధ్యమనే దోరణి పెరిగిపోయింది. ఇప్పటికే అనేక రంగాల్లో AI తన ప్రభావాన్ని చూపుతోంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పెట్టిన వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. అందేంటంటే ’AI బార్బర్ పాడ్’ దాన్నో ఎవరైనా తల పెడితే క్షణాల్లోనే మనిషి ముహానికి సరిపడే అందమైన హేర్‌స్టైల్‌ను చేసేస్తుంది. దీంతో ఈ వీడియో చూసినవారంతా ఇక నాయిబ్రాహ్మణులను ఎగతాళి చేస్తూ, AI చేసిన మ్యాజిక్ గురించి ఫన్నీ కామెంట్లు తెగ పెట్టేస్తున్నారు. అయితే దుబాయ్‌లో ఈ AI బార్బర్ పాడ్ ఉన్నట్లు కనిపిస్తున్న ఈ వీడియో పూర్తిగా డీప్‌ఫేక్ ద్వార చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరో వైపు త్వరలోనే AI ఇలాంటి మిషన్లను తీసుకువచ్చే అవకాశం లేకపోలేదన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా క్షణాల్లోనే క్షౌరం చేసిన ఈ AI బర్బర్ పాడ్ మాత్రం మాయాజాలంలానే కనిపిస్తున్నది.

Latest News