Allu Sirish | అల్లు శిరీష్ ప్రీవెడ్డింగ్ వేడుకలో మెగా–అల్లు సందడి.. ఫ్రేమ్ అదిరిపోయింది అంతే..!

Allu Sirish | అల్లు కుటుంబంలో పెళ్లి సంబరాలు ఊపందుకున్నాయి. హీరో అల్లు శిరీష్ Allu Sirish తన ప్రేయసి నయనికతో మార్చి 6న ఏడడుగులు వేయనున్న నేపథ్యంలో, వేడుకలు జోరుగా సాగుతున్నాయి.

Allu Sirish | అల్లు కుటుంబంలో పెళ్లి సంబరాలు ఊపందుకున్నాయి. హీరో అల్లు శిరీష్ Allu Sirish తన ప్రేయసి నయనికతో మార్చి 6న ఏడడుగులు వేయనున్న నేపథ్యంలో, వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే దుబాయ్‌లో అల్లు సోదరులు గ్రాండ్ పార్టీ నిర్వహించగా, హైదరాబాద్‌లోని వారి నివాసంలో పసుపు దంచే కార్యక్రమంతో వివాహ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో, అల్లు అర్జున్ Allu Arjun తన ఫామ్ హౌస్‌లో శుక్రవారం రాత్రి ఘనమైన ప్రీవెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీకి చెందిన అత్యంత సన్నిహితులు ఈ వేడుకకు హాజరైనట్లు సమాచారం.

మెగా అట్రాక్ష‌న్..

ప్రత్యేక ఆకర్షణగా రామ్ చ‌ర‌ణ్‌ Ram Charan తన భార్య ఉపాస‌న కొణిదెల‌ Upasana Kamineniతో కలిసి హాజరయ్యారు. బన్నీ–చరణ్ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకోవడం, కలిసి ఫోటోలకు పోజులివ్వడం అభిమానులను ఆనందానికి గురిచేసింది. కాబోయే వధూవరులు అల్లు శిరీష్–నయనికలతో పాటు, అల్లు అర్జున్–స్నేహారెడ్డి, రామ్ చరణ్–ఉపాసన దంపతులు కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బ్లాక్ డ్రెస్ కోడ్‌లో మెరిసిన అల్లు–మెగా కుటుంబ సభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీక్షలో ఉన్న చరణ్ చెప్పులు లేకుండా సాదాసీదాగా కనిపించగా, మిగతా వారు మోడ్రన్ లుక్స్‌లో దర్శనమిచ్చారు. చాలా కాలం తర్వాత బన్నీ–చెర్రీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో సోషల్ మీడియాలో సందడి నెలకొంది.

అల్లు-మెగా బాండింగ్..

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా, అల్లు కుటుంబాలకు ప్రత్యేక స్థానం ఉంది. గత కొంతకాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరిగినప్పటికీ, ఇలాంటి సందర్భాల్లో వారు ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ వస్తున్నారు. శిరీష్ ఎంగేజ్మెంట్‌కు మెగా కుటుంబం హాజరవడం, అలాగే చరణ్–ఉపాసన దంపతులకు కవలలు పుట్టినప్పుడు బన్నీ శుభాకాంక్షలు తెలపడం ఇందుకు ఉదాహరణగా నిలిచాయి.

ఈ ప్రైవేట్ వేడుకకు సుష్మిత కొణిదెల, నిహారిక కొణిదెల, వైష్ణవ్ తేజ్, సుశాంత్, రాశీ ఖన్నా, నభా నటేష్, కృతి శెట్టి, నేహా శెట్టి, సిద్ధూ జొన్నలగడ్డ, తేజ సజ్జా తదితరులు హాజరైనట్లు తెలుస్తోంది. అల్లు శిరీష్–నయనికల వివాహం మార్చి 6న వైభవంగా జరగనుండగా, అల్లు కుటుంబంలో చివరి పెళ్లి కావడంతో అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

Latest News