AUS vs BAN| వ‌ర‌ల్డ్ క‌ప్‌లో హ్య‌ట్రిక్ వికెట్ తీసిన క‌మ్మిన్స్.. డీఎల్ఎస్ ప‌ద్ద‌తిలో ఆసీస్ ఘ‌న విజ‌యం

AUS vs BAN| వ‌ర‌ల్డ్ క‌ప్‌లో హ్య‌ట్రిక్ వికెట్ తీసిన క‌మ్మిన్స్.. డీఎల్ఎస్ ప‌ద్ద‌తిలో ఆసీస్ ఘ‌న విజ‌యం ప్ర‌స్తుతం సూపర్ 8 మ్యాచ్‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. గ‌త రాత్రి ఆఫ్ఘ‌న్‌పై భార‌త్ 47 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించి రెండు పాయింట్లు ద‌క్కించుకుంది. ఇక తాజాగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఆసీస్ జ‌ట్టు డీఎల్ఎస్ ప‌ద్ద‌తిలో 28 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ప‌లుమార్లు మ్యాచ్‌కి వ‌ర్షం

  • Publish Date - June 21, 2024 / 10:44 AM IST

AUS vs BAN| వ‌ర‌ల్డ్ క‌ప్‌లో హ్య‌ట్రిక్ వికెట్ తీసిన క‌మ్మిన్స్.. డీఎల్ఎస్ ప‌ద్ద‌తిలో ఆసీస్ ఘ‌న విజ‌యం ప్ర‌స్తుతం సూపర్ 8 మ్యాచ్‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. గ‌త రాత్రి ఆఫ్ఘ‌న్‌పై భార‌త్ 47 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించి రెండు పాయింట్లు ద‌క్కించుకుంది. ఇక తాజాగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఆసీస్ జ‌ట్టు డీఎల్ఎస్ ప‌ద్ద‌తిలో 28 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ప‌లుమార్లు మ్యాచ్‌కి వ‌ర్షం అంత‌రాయం క‌లిగించిన కూడా 11.2 ఓవ‌ర్ల పాటు మ్యాచ్ జ‌రిగేలా చూశారు. అప్ప‌టికీ ఆస్ట్రేలియా స్కోరు రెండు వికెట్ల న‌ష్టానికి 100 ప‌రుగులు చేసింది. దీంతో డీఎల్ఎస్ ప‌ద్ద‌తిలో గెలిచిన‌ట్టు ప్ర‌క‌టించారు. వార్న‌ర్ 53 నాటౌట్‌, హెడ్(31), మార్ష్(1), మ్యాక్స్‌వెల్‌( 14 నాటౌట్‌) ప‌రుగులు చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎనిమిది వికెట్ల నష్టానికి 140 ప‌రుగులు చేసింది.

ఆస్ట్రేలియా పేసర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్ వికెట్ సాధించాడు. కమిన్స్ సూపర్ బౌలింగ్‌కు బంగ్లాదేశ్ బ్యాటర్లు మహ్మదుల్లా, మెహ్‌దీ హసన్, టౌహిడ్ హృదయ్ వరుసగా ఔట‌య్యారు. 18వ ఓవర్ చివరి రెండు బంతులకు మహ్మదుల్లా(2), మెహ్‌దీ హసన్‌ను ఔట్ చేసిన కమిన్స్.. చివరి ఓవర్ తొలి బంతికి టౌహిడ్ హృదయ్(4)ను పెవిలియన్ చేర్చాడు. మహ్మదుల్లాను క్లీన్ బౌల్డ్ చేసిన కమిన్స్, మెహ్‌దీ హసన్, టౌహిడ్ హృదయ్‌లను క్యాచ్ ఔట్ చేశాడు. ఈ ఫీట్‌తో టీ20 ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ వికెట్ తీసిన రెండో ఆస్ట్రేలియా బౌలర్‌గా కమిన్స్ అరుదైన ఫీట్ సాధించాడు. ఓవ‌రాల్‌గా చూస్తే… ఈ ఘనతను అందుకున్న ఏడో బౌలర్‌గా నిలిచాడు.

ఆసీస్ తరఫున బ్రెట్ లీ.. 2007 టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ వికెట్ తీసిన విష‌యం తెలిసిందే. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. కమిన్స్(3/29) హ్యాట్రిక్ ధాటికి బంగ్లాదేశ్ 140 పరుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. టౌహిడ్ హృదయ్(28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), నజ్ముల్ హోస్సేన్ షాంటో(36 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 41) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా(2/24) రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినీస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ తలో వికెట్ తీసారు.

Latest News