Site icon vidhaatha

Rcb vs CSK| ధోనిలో కనిపించిన కోపం.. విరాట్ కంట్లో క‌న్నీళ్లు.. ఎమోష‌న‌ల్ అయిన అనుష్క‌

Rcb vs CSK| గ‌త రాత్రి జ‌రిగిన ఆర్సీబీ- చెన్నై మ్యాచ్ ఎంత థ్రిల్లింగ్‌గా సాగిందో మ‌నం చూశాం. గెలుపు దోబూచులాడుతూ చివరికి ఆర్సీబీ చెంత చేరింది. ప్లే ఆఫ్స్‌కి వెళ్లాలంటే 18 ప‌రుగుల తేడాతో గెల‌వాల్సి ఉండ‌గా, ఆర్సీబీ ఏకంగా 27 ప‌రుగుల తేడాతో గెలుపొంద‌డం వ‌ల‌న రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు ఆనందం అంతా ఇంతాకాదు.ఆర్సీబీ ఆట‌గాళ్ల‌లో అనేక ర‌కాల భావాలు క‌నిపించాయి. ముఖ్యంగా అంద‌రి దృష్టి కోహ్లీపై ఉండ‌గా, ఆయ‌న ఏకంగా క‌న్నీళ్లు పెట్టుకున్న‌ట్టు కెమెరాలో రికార్డ్ అయింది. మ‌రోవైపు విరాట్ కోహ్లీ భార్య అనుష్క శ‌ర్మ కూడా ఎమోష‌న‌ల్ అయింది. ఆమె క‌ళ్లు చెమ‌ర్చాయి. అందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

ఇక త‌న జ‌ట్టుని గెలిపించ‌లేక‌పోయినందుకు ధోని చాలా బాధ‌ప‌డ్డాడు. డ‌గౌట్‌కి వెళ్లే స‌మ‌యంలో బ్యాట్‌ని గ‌ట్టిగా కొంద కొట్టాడు. అంత కోపం ఇన్నాళ్ల కెరీర్‌లో ఎప్పుడు కనిపించ‌లేదు. ఇది ధోనికి చివ‌రి ఐపీఎల్ అని అంటుండ‌గా, ట్రోఫీ అందించ‌లేక‌పోయాన‌నే బాధ‌లో ధోని అలా చేసి ఉంటాడా అని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. 42ఏళ్ల ధోనీ.. టీమ్​ కోసం తన వంతు ఎంతో ప్ర‌య‌త్నం చేశాడు. 13 బాల్స్​లో 3 ఫోర్లు, 1 సిక్స్​తో 25 పరుగులు రాబ‌ట్టాడు. 192.31 స్ట్రైక్​రేట్​ మెయింటైన చేసిన ధోని చివరి ఓవర్​లో ఔట్​ అయ్యాడు. ఆ స‌మ‌యంలో మిస్టర్​ కూల్​ చాలా ఫ్ట్ర‌స్ట్రేట్ అయ్యాడు. ఆయ‌న‌ ఇలా చేయడం చాలా అరుదు. సీఎస్కేకి ఆ గెలుపు ఎంత ముఖ్యమో దీని బట్టి మనం అర్థం అవుతుంది.

2019 వరల్డ్​ కప్​ సెమీఫైనల్స్​.. ధోనీకి చివరి ఇంటర్నేషనల్​ మ్యాచ్ కాగా, ఆ స‌మ‌యంలో టీమిండియా న్యూజిలాండ్ చేతిలో ఓట‌మి పాలైంది.అప్పుడు ధోని ముఖంలో చాలా బాధ క‌నిపించింది. ఇక 2020 ఆగస్ట్​ 15.. ఇంటర్నేషనల్​ క్రికెట్​కి గుడ్​ బై చెబుతున్నట్టు ధోనీ ప్రకటించాడు. ఇక ఐపీఎల్​ 2024 ధోనికి లాస్ట్ ఐపీఎల్ అని అంతా అనుకున్నారు.ఈ స‌మ‌యంలో చెన్నై జట్టు ఫైన‌ల్‌కి వెళ్లి క‌ప్ కొట్టాల‌ని ప్ర‌తి ఒక్క‌రు భావించారు. కాని ఇందులో కూడా సీఎస్కే మాజీ సారథి ధోనీకి హార్ట్​-బ్రేక్​ తప్పలేదు. అందుకే.. ఇప్పుడే రిటైర్​ అవ్వొద్దని, ఇంకో సీజన్​ ఆడాలంటూ అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు.

Exit mobile version