Team India | కోచ్‌ పదవికి రాహుల్‌ ద్రవిడ్‌ గుడ్‌బై..! టీమిండియా హెడ్‌కోచ్‌ రేసులో ముగ్గురు..!

Team India | వెస్టిండిస్‌, అమెరికా వేదికగా జరిగే టీ20 వరల్డ్‌ కప్‌ అనంతరం టీమిండియా హెడ్‌కోచ్‌ పదవి నుంచి రాహుల్‌ ద్రవిడ్‌ తప్పుకోనున్నాడు. ఇక ద్రవిడ్‌ ప్లేస్‌లో మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ను బీసీసీఐ కోరినట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని క్రిక్‌ఇన్‌ఫో వెల్లడించింది. ద్రవిడ్‌ పదవీకాలం గత ప్రపంచకప్‌ తర్వాత ముగిసింది.

  • Publish Date - May 19, 2024 / 10:00 AM IST

Team India | వెస్టిండిస్‌, అమెరికా వేదికగా జరిగే టీ20 వరల్డ్‌ కప్‌ అనంతరం టీమిండియా హెడ్‌కోచ్‌ పదవి నుంచి రాహుల్‌ ద్రవిడ్‌ తప్పుకోనున్నాడు. ఇక ద్రవిడ్‌ ప్లేస్‌లో మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ను బీసీసీఐ కోరినట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని క్రిక్‌ఇన్‌ఫో వెల్లడించింది. ద్రవిడ్‌ పదవీకాలం గత ప్రపంచకప్‌ తర్వాత ముగిసింది. అదే సమయంలో కోచ్‌ పదవి నుంచి తప్పుకునేందుకు రాహుల్‌ ద్రవిడ్‌ సిద్ధం కాగా.. బీసీసీఐ టీ20 వరల్డ్‌ కప్‌ వరకు కొనసాగేలా ఒప్పించింది. పొట్టి కప్‌ ముగిసిన అనంతరం కోచ్‌గా పదవీ విరమణ చేయబోతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల బీసీసీఐ కోచ్‌ నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించింది. కొత్త కోచ్‌ 3.5 సంవత్సరాల పాటు భారత క్రికెట్ జట్టుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ మే 27గా నిర్ణయించింది. దరఖాస్తులకు మే 27 చివరి తేదీగా బీసీసీఐ నిర్ణయించింది.

హెడ్‌ కోచ్‌గా గంభీర్‌కి ఛాన్స్‌..

అయితే, టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టాలని బీసీసీఐ కోరుకుంటున్నట్లుగా క్రిక్‌ఇన్‌ఫో నివేదిక పేర్కొంది. వాస్తవానికి గంభీర్‌ ఐపీఎల్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు మెంటార్‌గా కొనసాగుతున్నాడు. అతని మెంటార్‌షిప్‌లో కోల్‌కతా ఈ సీజన్‌లో ప్లే ఆఫ్‌కి అర్హత సాధించింది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టు ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టు కావడం విశేషం. ఇంతకు ముందు గంభీర్‌ లక్నో సూపర్‌ జెయింట్‌కు మెంటార్‌గా రెండేళ్లు కొనసాగాడు. మళ్లీ కేకేఆర్‌ మెంటార్‌గా కొనసాగుతున్నాడు. మరి టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేస్తాడా? లేదా చూడాల్సిందే.

రేసు లక్ష్మణ్‌ కూడా..

టీమిండియా కోచ్‌ రేసులో భారత మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేరు సైతం వినిపిస్తున్నది. కోచ్‌ పదవికి లక్ష్మణ్‌ దరఖాస్తు చేసినా పోటీ ఉండనున్నది. ప్రస్తుతం వీవీఎస్‌ లక్ష్మణ్ జాతీయ క్రికెట్‌ అకాడమీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇండియా-ఏ, అండర్‌-19 జట్లు లక్ష్మణ్‌ పర్యవేక్షణలోనే ఉన్నాయి. ద్రవిడ్‌ సెలవుల్లో ఉన్న సమయంలో భారత జట్టు తాత్కాలిక హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అతని పర్యవేక్షణలో హాంగ్‌జౌ ఆసియా క్రీడలలో భారత జట్టు పాల్గొన్నది. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన T20 సిరీస్‌తో పాటు, అతను ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఐర్లాండ్ పర్యటనలో కోచ్‌గా పని చేశారు.

ఫ్లెమింగ్‌పై దృష్టి..

టీమిండియా కోచ్‌ రేసులో ప్రధాన వినిపిస్తున్న మరో పేరు స్టీఫెన్‌ ఫ్లేమింగ్‌. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడిని హెడ్‌కోచ్‌గా నియమించాలని బీసీసీఐ కోరుకుంటున్నది. అయితే, మరి ఫ్లేమింగ్‌ ఈ పోస్ట్‌కి దరఖాస్తు చేస్తాడా? లేదా? త్వరలోనే తేలనున్నది. కోచ్‌గా వచ్చేందుకు సిద్ధమైతే ఏడాదిలో పది నెలల పాటు జట్టుతోనే ఉండాల్సి ఉంటుంది. ఇక 2009 నుండి చెన్నై సూపర్ కింగ్స్ కోచ్‌గా ఉన్న ఫ్లెమింగ్ ద్రవిడ్ స్థానంలో బాగుంటుందని బీసీసీఐ భావిస్తున్నది. ఫ్లేమింగ్‌కు మంచి అనుభవం ఉన్నది. సీఎస్‌కే కోచ్‌గా అద్భుతమైన ట్రాక్‌ ఉన్నది. ఇక వీరితో పాటు జస్టిన్‌ లాంగర్‌తో పాటు మరికొందరు పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఎవరు ఎవరు దరఖాస్తు చేస్తారో వేచి చూడాల్సిందే.

Latest News