Gukesh |17 ఏళ్ల వ‌య‌స్సులోనే క్యాండిడేట్ గెలిచి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన గుకేశ్

Gukesh |పిట్ట కొంచెం కూత ఘ‌నం అనే సామెత మ‌నంద‌రం వినే ఉంటాం. వ‌య‌స్సు చిన్న‌దైన రికార్డులు మాత్రం పెద్దవి సాధించిన వారికి ఈ సామెత చెబుతారు. తాజాగా గుకేశ్ 17 ఏళ్ల వయసులో ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టైటిల్ సాధించి ప్ర‌పంచ రికార్డ్ సృష్టించాడు. ఈ క్రమంలోనే అత్యంత పిన్న

  • Publish Date - April 22, 2024 / 10:23 AM IST

Gukesh |పిట్ట కొంచెం కూత ఘ‌నం అనే సామెత మ‌నంద‌రం వినే ఉంటాం. వ‌య‌స్సు చిన్న‌దైన రికార్డులు మాత్రం పెద్దవి సాధించిన వారికి ఈ సామెత చెబుతారు. తాజాగా గుకేశ్ 17 ఏళ్ల వయసులో ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టైటిల్ సాధించి ప్ర‌పంచ రికార్డ్ సృష్టించాడు. ఈ క్రమంలోనే అత్యంత పిన్న వయసులోనే వరల్డ్ ఛాంపియన్షిప్ ఛాలెంజర్ గా నిలిచిన వ్యక్తి నిలిచాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్యాండిడేట్స్ గెలిచిన రెండో భారతీయుడు గుకేశ్ కావ‌డం గ‌మ‌న‌ర్హం. ఈ టోర్నీ చరిత్రలో విజేతగా నిలిచిన తొలి టీనేజర్ మాత్రం గుకేశ్ అని చెప్పాలి. చెన్నైకి చెందిన దొమ్మరాజు గుకేశ్.. ఈ క్యాండిడేట్స్ టోర్నీలో 14 రౌండ్లలో 9 పాయింట్లతో తొలిస్థానంలో నిలిచాడు.

కెనడాలోని టొరాంటో వేదికగా గత రెండువారాలుగా..14 రౌండ్లుగా ఈ చాంపియ‌న్ షిప్ జ‌రుగుతుంది..ప్రపంచ మేటి ఎనిమిదిమంది గ్రాండ్ మాస్టర్ల నడుమ జరిగిన 2024- ప్రపంచ క్యాండిడేట్స్ చదరంగ సమరంలో గుకేశ్ సరికొత్త చ‌రిత్ర సృష్టించాడు. ఇక ఈ విజ‌యంతో వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ కోసం డింగ్ లైరెన్ తో గుకేశ్ త‌ల‌ప‌డ‌నున్నాడు. అయితే క్యాండిడేట్స్ చివరి రౌండ్లో జపాన్ ప్లేయర్ హిరాకు నకమురాతో గేమ్ డ్రా చేసుకున్న గుకేశ్.. టోర్నీ విజేతగా నిలిచాడు. అయితే అప్ప‌టికే గుకేశ్ టాప్ లో ఉండ‌గా, ఆయ‌న డ్రా చేసుకున్నా కూడా విజేత‌గా నిలుస్తారు. మరోవైపు నకమురాతోపాటు ఫ్యాబియానో కరువానా, ఇయాన్ నెపోమ్నియాచ్చిలాంటి ప్లేయర్స్ చివరి రౌండ్లో త‌ప్ప‌క గెల‌వాల్సిన ప‌రిస్థితి. అయితే గుకేశ్ డ్రా చేయ‌డంతో అత‌నికి టైటిల్ ద‌క్కింది.

గుకేశ్‌.. కీలకమైన 13వ రౌండ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన పిరౌజా అలీరెజాను ఓడించి 8.5 పాయింట్లతో తొలి స్థానాన్ని ద‌క్కించుకున్నాడు. 47వ ఎత్తులో ప్ర‌త్య‌ర్ధిని చిత్తు చేశాడు. 14వ రౌండ్‌లో మాత్రం న‌క‌మురాతో డ్రా చేసుకోవ‌డం వ‌ల‌న ఫిడే క్యాండిటేట్స్‌ టోర్నీని సొంతం చేసుకున్నాడు.ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ 2014లో ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టైటిల్ నెగ్గగా, ఇప్పుడు పదేళ్ల తరువాత గుకేశ్ అదే ఘనతను సాధించగలిగాడు.12 సంవత్సరాల వ‌య‌స్సులోనే గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన చెన్నై కుర్రాడు గుకేశ్ ప్రపంచ క్యాండిడేట్స్ టైటిల్ నెగ్గడం ద్వారా ప్రపంచ రికార్డు సాధించ‌డంతో పాటు 2025 ప్రపంచ చెస్ టైటిల్ గెలుచుకొనే అవకాశాన్ని కూడా సంపాదించాడు.

Latest News