Hardik Pandya| గత కొద్ది రోజులుగా హార్ధిక్ పాండ్యా- నటాషా విడాకులకి సంబంధించి నెట్టింట అనేక ప్రచరాలు సాగుతుండగా, వాటిపై ఎట్టకేలకి క్లారిటీ వచ్చింది. అందరు అనుకున్నట్టే హార్దిక్ పాండ్యా వైవాహిక జీవితం విషాదంతంగా ముగిసింది. గత రాత్ర హార్దిక్ తన భార్య నటాషాకు విడాకులు ఇచ్చినట్టు ప్రకటించారు. ఇద్దరు ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని, తమ మూడేళ్ల కొడుకు అగస్త్య బాధ్యతలను తల్లిదండ్రులుగా కొనసాగిస్తామంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రకటన తర్వాత వారి విడాకులు కారణం ఏంటని నెటిజన్స్ ఆరాలు తీస్తున్నారు.
హార్ధిక్ పాండ్యా, నటాషా విడాకులకి కారణం ఎఫైర్స్ అంటున్నారు. అలెగ్జాండర్ అలెక్సిలిక్ అనే వ్యక్తితో క్లోజ్‌గా కనిపిస్తూ ఉండడం, అతనితో రిలేషన్ షిప్‌ని మెయింటైన్ చేస్తుండడం వల్లనే హార్ధిక్ ఆమెకి విడాకులు ఇచ్చారని అంటున్నారు. దిశాపటానీ బాయ్‌ఫ్రెండ్‌గా చెప్పుకుంటున్న అలెగ్జాండర్ అలెక్సిలిక్‌తో అంబాని ఇంట పెళ్లికి కూడా హాజరైంది నటాషా.అయితే ఈ అమ్మడి డేటింగ్ లిస్ట్ చాలా పెద్దదే అంటున్నారు. ప్రముఖ టీవీ నటుడు అలీ గోనితో డేటింగ్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త సామ్ మర్చంట్‌తో కూడా డేటింగ్ చేసిందట. ఈ డేటింగ్ వ్యవహారాల వల్లనే హార్ధిక్- నటాషాల నాలుగేళ్ల వైవాహిక బంధానికి బ్రేక్ పడింది. ఇక నటాషా ఫిబ్రవరి 2023లో ఉదయపూర్‌లో హార్దిక్ పాండ్యాను వివాహం చేసుకుంది. ఈ జంట మే 2020లో అగస్త్య అనే బిడ్డకు జన్మనిచ్చారు.
నటాషా నర్తకి, నటి, మోడల్. ప్రకాష్ ఝా దర్శకత్వం వహించిన సత్యాగ్రహ అనే బాలీవుడ్ చిత్రంతో అరంగేట్రం చేసింది. బిగ్ బాస్ 8లో కూడా కంటెస్టెంట్ గా ఉంది. ఈ అమ్మడు హార్ధిక్‌ని పెళ్లి చేసుకున్నాక ఐపీఎల్ ప్రతి సీజన్‌లో కనిపించి తన భర్తని ఎంకరేజ్ చేస్తూ ఉండేది. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‌గా పాండ్యా అరంగేట్రం చేసినప్పుడు నటాషా కనిపించలేదు. ఏ మ్యాచ్ చూసేందుకు రాలేదు. మరోవైపు మార్చి 4 నటాషా పుట్టినరోజు కాగా, ఆ రోజు, హార్దిక్ పాండ్యా తన భార్యకు సోషల్ మీడియాలో విషెస్ కూడా చెప్పలేదు. మరోవైపు నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి పాండ్యా అనే ఇంటిపేరును తొలగించడంతో వారిద్దరు విడాకులు తీసుకోవడం ఖాయమని అందరు భావించారు.చివరికి అదే నిజం అయింది.