Site icon vidhaatha

IND vs ZIM| రాణించిన గిల్‌.. రెండో టీ20లో కష్టప‌డి గెలిచిన టీమిండియా!

IND vs ZIM| జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భార‌త్ 23 పరుగుల తేడాతో విజ‌యం సాధించింది. భార‌త్ భారీ ల‌క్ష్యాన్ని విధించిన కూడా ఆ టార్గెట్‌ని చేజ్ చేసేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేసింది ఆతిథ్య జ‌ట్టు. మ్యాచ్‌లో టీమిండియా యువ జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. దూకుడుగా ఆడిన ఈ జోడీ తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించారు. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్(49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో అద‌ర‌గొట్ట‌గా, యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36) కీలక ఇన్నింగ్స్ ఆడారు. యశస్వి జైస్వాల్ ఔటైనా శుభ్‍మన్ గిల్ జోరు త‌గ్గించ‌లేదు. ఇక అభిషేక్ శర్మ (10) ఎక్కువ సేపు నిలువలేదు.

ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన రుతురాజ్ మొద‌ట్లో కాస్త నిదానంగా ఆడి ఆ త‌ర్వాత గేరు మార్చాడు. ఈ క్ర‌మంలో 28 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు రుతురాజ్. 4 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదాడు. అయితే, చివరి ఓవర్ నాలుగో బంతికి ఔటై ఒక్క పరుగు తేడాతో అర్ధ శకతం మిస్ చేసుకున్నాడు.ఇక ఆ త‌ర్వాత వ‌చ్చిన సంజూ శాంసన్ 7 బంతుల్లో 12 పరుగులు చేశాడు. మొత్తానిఇక 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగులు చేసింది భార‌త జ‌ట్టు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబని(2/25), సికందర్ రాజా(2/24) రెండేసి వికెట్లు తీసారు. ఇక 183 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన జింబాబ్వే జ‌ట్టు 20 ఓవర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి 159 ప‌రుగులు చేసింది.

డియోన్ మేయ‌ర్స్ (65 నాటౌట్‌) అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడ‌గా, మండాడే( 37) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. ఇక చివ‌ర‌లో వ‌చ్చిన మ‌స‌క‌ద్జ( 10 బంతుల్లో 18) కూడా బ్యాట్ ఝుళిపించాడు. మొద‌ట్లో వెంట‌వెంట‌నే వికెట్లు ప‌డ‌డంతో నెమ్మ‌దిగా ఆడిన జింబాబ్వే జ‌ట్టు ఆ త‌ర్వాత గేర్ మార్చి బౌండ‌రీల మోత మోగించారు. భార‌త బౌల‌ర్స్ ధాటికి జింబాబ్వే జ‌ట్టు 39 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయింది. క‌నీసం వంద ప‌రుగులు అయిన సాధిస్తుందా లేదా అనుకున్న‌ప్ప‌టికీ, మేయర్స్ అద్భుత‌మైన ఇన్నింగ్స్‌తో 159 ప‌రుగులు చేశారు.ఇక భార‌త బౌల‌ర్స్ లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ అద్భుత‌మైన బౌలింగ్ చేశాడు. 4 ఓవ‌ర్లు వేసి 15 ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసాడు. ఇక ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు, ఖ‌లీల్ అహ్మ‌ద్ ఒక వికెట్ తీసుకున్నారు. త‌దుపరి మ్యాచ్ జూలై 13న జ‌ర‌గ‌నుంది.

Exit mobile version