India Vs South Africa : దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో బూమ్రాకు 5వికెట్లు

దక్షిణాఫ్రికా తొలి టెస్టులో జస్ప్రీత్ బూమ్రా 5 వికెట్లు కూలగొట్టి సఫారీలను 159 పరుగులకు అలౌట్ చేశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ త్వరగానే అవుటయ్యాడు.

India Vs South Africa

విధాత : కొల్ కత్తా వేదికగా భారత్ తో జరుగుతున్న తొలిటెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా ధాటికి 55ఓవర్లలో 159పరుగులకు అలౌటైంది. బూమ్రా 5వికెట్లు పడగొట్టి సఫారీలను కట్టడి చేశాడు. సిరాజ్, కుల్ధీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు, అక్షర పటేల్ 1వికెట్ సాధించారు.

దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ మార్ క్రమ్ ఒక్కడే అత్యధికంగా 31పరుగులు సాధించాడు. రికిల్టన్ 23, ముల్డర్ 24, డీజార్జీ 24పరుగులు సాధించారు.

యశస్వీ అవుట్

దక్షిణాఫ్రికాను తక్కువ స్కోర్ కే అలౌట్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించి ఆదిలోనే ఓపెనర్ యశస్వీ జైస్వాల్ వికెట్ కోల్పోయింది. జైస్వాల్ 12పరుగులకు సఫారీ పేసర్ జన్సెన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 20ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 37పరుగులు చేసింది. కేఎల్ రాహల్ 13, వాషింగ్టన్ సుందర్ 6పరుగులతో ఆడుతున్నారు.