మొదటి రోజు 35 ఓవర్ల ఆట మినహా మిగతా రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయిన భారత్–బంగ్లాల (India-Bangladesh 2nd test) రెండో టెస్ట్మ్యాచ్లో నాలుగో రోజు మాత్రమే ఆట మళ్లీ సాధ్యమైంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా, తొలిరోజు స్కోరు 107/3 ను కొనసాగించి, 233 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను సునామీలా మార్చింది. టి20 మ్యాచ్(T20 match)లా రెచ్చిపోయిన భారత బ్యాటర్లు 3 ఓవర్లలో 50 పరుగులు, 10 ఓవర్లలో 100 పరుగులు చేసారు. భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌ను 34.4 ఓవర్ల వద్ద 9 వికెట్లకు 285 పరుగుల వద్ద డిక్లేర్ ( 285/9 Dec in 34.4 overs)చేసింది. మొత్తంగా 8.22 రన్ రేట్‌తో భారత్ ఈ టెస్ట్ ఇన్నింగ్స్ ఆడింది. ఈ క్రమంలో ఇండియా నమోదు చేసిన రికార్డులను చూద్దాం.
టెస్ట్ మ్యాచ్‌లో అత్యతం వేగవంతమైన 50, 100, 150, 200 పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. ఇవన్నీ కూడా ఒకే మ్యాచ్‌లో, ఒకే ఇన్నింగ్స్‌లో నమోదవడం గమనార్హం.
1. భారత ఓపెనింగ్ జోడీ తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించింది. 50 పరుగులు కేవలం మూడు ఓవర్లలో రావడం విశేషం. ఇది టెస్ట్ మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ(Fastest Fifty in Test Matches). ఇంతకుముందు ఇంగ్లండ్, వెస్టిండీస్‌పై 4.2 ఓవర్లలో చేసింది. రన్‌రేట్ 16.6
2. అంతర్జాతీయ మ్యాచ్‌లలో (అన్ని ఫార్మాట్లలో కలిపి) 20 బంతుల లోపు 50 పరుగులు చేయడం ఇదే మొదటి సారి. అంతకుముందు 22 బంతుల్లో ఇదే బంగ్లాపై టి20 మ్యాచ్‌లో 50 చేసింది. 50 Runs in below 20 balls
3. ఈ ఏడాది ఆడిన 8 టెస్ట్ మ్యాచ్‌లలో భారత్ కొట్టిన సిక్స్‌లు 90. ఒక క్యాలెండర్ ఏడాదిలో ఇన్ని సిక్స్‌లు ఇంతవరకు ఏ జట్టు కొట్టలేదు. ఇంగ్లండ్ రెండోస్థానంలో 89 సిక్స్‌లతో ఉంది. (90 Sixers in 8 test matches.
4. తానెదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్స్‌లుగా మలవడం ఇది నాలుగోసారి. రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. మొత్తంగా మూడుసార్లూ భారతే కొట్టగా, ఒకసారి వెస్టిండీస్ 1942లో సాధించింది. భారత్ తరపున సచిన్, ఉమేశ్ యాదవ్ మిగతా ఇద్దరు. 2 Sixes of 1st two balls faced by Rohit.
5. ఒక టెస్ట్ మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన 100 పరుగుల రికార్డు ఈ మ్యాచ్‌లో భారత్ నమోదు చేసింది. 100 పరుగులకు 10.1 ఓవర్లు, 61 బంతులు అవసరమయ్యాయి. Fastest 100 in a Test.
6. ఒక టెస్ట్ మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన 150 పరుగుల రికార్డు ఈ మ్యాచ్‌లో భారత్ నమోదు చేసింది. 150 పరుగులకు 18.12 ఓవర్లు, 112 బంతులు తీసుకున్నారు. Fastest 150 in a Test.
7. ఒక టెస్ట్ మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన 200 పరుగుల రికార్డు ఈ మ్యాచ్‌లో భారత్ నమోదు చేసింది. 200 పరుగులు 24.2 ఓవర్లు, 148 బంతులలో చేసింది. Fastest 200 in a Test.
8. ఇదే మ్యాచ్‌లో రవీంద్ర జడేజా టెస్టుల్లో 300 వికెట్లు తీసుకున్న బౌలర్‌గా అవతరించాడు. 3000లకు పైగా పరుగులు, 300 వికెట్లు సాధించిన 11వ ఆల్‌రౌండర్, భారత్ తరపున మూడో ఆటగాడు. ముందున్నది కపిల్‌దేవ్, అశ్విన్. 300 Wickets – 3000 Runs for Jadeja