Site icon vidhaatha

ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం

నలుగురిపై ఫిర్యాదు చేసిన బీసీసీఐ
ఆ రెండు మ్యాచ్‌లపై అనుమానాలు

విధాత : ఐపీఎల్‌-17సీజన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేగింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన నలుగురిపై బీసీసీఐ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుకీల ప్రమేయంతోనే వాంఖడే స్టేడియంలో గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై చేతిలో ముంబై ఓడిపోయిందని, జైపూర్ స్టేడియంలో ఢిల్లీతో గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడిపోయిందని బీసీసీఐ అనుమానిస్తుంది. వాంఖడే, సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో స్టేడియంలో బుకీలు పేరున్న వ్యక్తులుగా చలామణి అవుతూ ఆటగాళ్లతో బేరసారాలు సాగించారని బీసీసీఐ ఏసీబీ విభాగం గుర్తించింది. అనుమానితులైన నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మ్యాచ్ చూసేందుకు లగ్జరీ బాక్స్‌లో వీఐపీలుగా కూర్చుని ఆటగాళ్లతో బేరసారాలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు.

ఐపీఎల్ మెగాటోర్నీలో తరుచు మ్యాచ్ ఫిక్సింగ్ ఘటనలు వెలుగుచూడటం నిర్వాహణ లోపాలను బహిర్గతం చేస్తుంది. గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో 2016, 2017 సీజన్స్‌లో పాల్గొనకుండా.. రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. సీఎస్‌కే జట్టు మాజీ ప్రిన్సిపాల్ గురునాథ్ మీయప్పన్‌తో పాటు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలా స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టు చేసి, వారిపై నిషేధం విధించింది. ఇప్పుడు తాజాగా మరోసారి.. ఐపీఎల్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు వెలుగుచూశాయి.

Exit mobile version