Site icon vidhaatha

మూడోసారి కూడా మునిగిన ముంబై

mumbai

ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians)వరుసగా మూడో ఓటమి చవి చూసింది. తమ సొంత మైదానం వాంఖడే స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్(Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. రాజస్తాన్ బౌలర్లలు ట్రెంట్ బౌల్ట్, చాహల్ తొలిబంతి నుండే ముంబై బ్యాటర్లకు వణుకు పుట్టించి చెరో మూడు వికెట్లు తీసుకోగా.. బర్గర్ రెండు, అవేష్ ఖాన్ ఒక్క వికెట్ సాధించారు.

ముంబై బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(34) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. తన ఇన్నింగ్స్లో ఒక్క పరుగుకే ఓపెనర్లు రోహిత్శర్మ, నమన్ధీర్లను, 14 పరుగుల వద్ద బ్రెవిస్, 20 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ను కోల్పోయిన ముంబై ఇక ఏ దశలోనూ కోలుకోలేదు. హార్థిక్ పాండ్యా, తిలక్ వర్మ కొంతసేపు ప్రతిఘటించినా ఉపయోగం లేకపోయింది.

అనంతరం 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లలో రియాన్ పరాగ్ (Ryan Parag)(54 నాటౌట్ : 39 బంతుల్లో 5 ఫోర్లు, మూడు సిక్సర్లు) వరుసగా రెండో ఫిఫ్టీతో చెలరేగి విజయాన్ని అందించాడు. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా, ముంబై తన అట్టడుగు స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.

Exit mobile version