Site icon vidhaatha

IPL | ఉగ్రదాడి మృతులకు.. ఐపీఎల్ ఆటగాళ్ల నివాళి!

విధాత: పహల్గాం ఉగ్రదాడిపై దేశ వ్యాప్తంగా నిరనసనలు వ్యక్తమవుతున్నాయి. అమాయక పర్యాటకులు 26మందిని కాల్చి చంపిన ఉగ్రవాదుల దుశ్చర్యను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఐపీఎల్‌-2025 (IPL-2025) లో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (SRH)‌, ముంబై ఇండియన్స్‌ (MI) ఆటగాళ్లు సైతం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లతో పాటు అంపైర్‌లు కూడా చేతులకు నల్ల రిబ్బన్‌లు ధరించి మ్యాచ్ లో పాల్గొన్నారు. ఉగ్రదాడిని నిరసిస్తూ మ్యాచ్‌కు ముందు ఒక నిమిషంపాటు మౌనం పాటించి మృతులకు సంతాపం తెలిపారు. అదేవిధంగా ఉగ్రదాడికి నిరసనగా..మృతులకు నివాళిగా మ్యాచ్‌లో చీర్‌ లీడర్స్‌ను పక్కన పెట్టడంతో పాటు పటాకులు కాల్చకుండా నిర్ణయం తీసుకుున్నారు.

 

Exit mobile version