WPL-2026 : MI vs DC | ఢిల్లీ గెలుపు : ముంబైకి వరుసగా మూడో పరాజయం

వడోదరలో జరిగిన WPL 2026 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘనవిజయం సాధించింది. ముంబై 154/5కు మాత్రమే పరిమితమవగా, జెమీమా రోడ్రిగ్స్ హాఫ్‌సెంచరీతో ఢిల్లీ లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. ముంబైకి వరుసగా మూడో పరాజయం, ఓపెనింగ్ వైఫల్యం మరోసారి పీడకలలా మారింది.

WPL 2026 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు షఫాలి వర్మ, లిజెల్ లీ ఆగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేస్తూ రన్స్ కోసం పరుగెత్తుతున్న క్లోజ్-అప్ యాక్షన్ ఫోటో.

DC Beat MI by 7 Wickets: Mumbai Slip to Third Straight Loss in WPL 2026

WPL-2026 : MI vs DC | వడోదరలో జరిగిన ముంబై ఇండియన్స్​ – ఢిల్లీ క్యాపిటల్స్​ మ్యాచ్​లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్​ చేసిన ముంబై 154 పరుగులు మాత్రమే చేయగా, ఢిల్లీ కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అయినా ముంబై ఇండియన్స్​ పాయింట్స్​ పట్టికలో రెండో స్థానంలో ఉండటం విశేషం.

ఢిల్లీ క్యాపిటల్స్​ : ఆడుతూ..పాడుతూ..

ముంబై విధించిన 155 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేధించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు, షఫాలీ వర్మ, లిజెల్​ లీ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. మొదటినుండే దూకుడుగా ఆడిన ఈ ఇద్దరు తొలి వికెట్​కు 63 పరుగులు జోడించారు.  షఫాలీ తన 29 పరుగుల స్కోరు వద్ద అవుట్​ కాగా, జట్టు స్కోరు 84 పరుగుల వద్ద లీ () దురదృష్టవశాత్తు అవుటై, తృటిలో హాఫ్​ సెంచరీ చేజార్చుకుంది. అప్పుడు క్రీజ్​లోకి వచ్చిన కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్​ లారా వోల్వార్డ్స్​తో జత కలిసి నింపాదిగా ఆడుతూ గమ్యం దిశగా కదిలింది. ఇంతలో లారా() రనౌట్​ కాగా, వచ్చిన మేరిజాన్​ కప్​లో కలిసి జెమీమా గమ్యాన్ని చేరుకుంది. చివర్లో కొంత ఉత్కంఠ కలిగినా, జెమీమా () హాఫ్​ సెంచరీతో ఢిల్లీ సురక్షితంగా విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లలో అమన్​జోత్​ కౌర్​, వైష్ణవీ శర్మ చెరో వికెట్​ తీసుకున్నారు.

ముంబై ఇండియన్స్​ : మరోసారి ఓపెనింగ్​ వైఫల్యం

అంతకుముందు టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్​కు ఓపెనింగ్ మరోసారి నిరాశ కలిగించింది. సజీవన్ సజనా నందిని శర్మ బౌలింగ్‌లో పెవిలియన్ చేరగా, వెంటనే తదుపరి ఓవర్‌లో హేలీ మాథ్యూస్‌ను మారిజానే క్యాప్ ఔట్ చేసింది. కేవలం 21 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన ముంబై ఇండియన్స్ ప్రారంభం నుంచే ఒత్తిడిలో పడింది. ఇదే సమయంలో నాట్ సివర్​–బ్రంట్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే పనిని చేపట్టారు. ఇరువురూ జాగ్రత్తగా ఆడుతూ ముంబైను నిలబెట్టారు. తరువాత గేర్ మార్చిన హర్మన్‌ప్రీత్, షఫాలి వర్మ వేసిన ఓవర్‌లో వరుసగా మూడు బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌కు వేగం తీసుకొచ్చింది. ఆ సమయంలోనే ఇన్నింగ్స్​ కీలక మలుపు తిరిగింది.

15వ ఓవర్‌లో శ్రీచరణి బౌలింగ్‌లో హర్మన్‌ప్రీత్ భారీ షాట్ ఆడబోయి లాంగ్–ఆన్ వద్ద క్యాచ్ ఇచ్చి 41 పరుగులకు ఔటయ్యింది. అక్కన్నుంచి మరి ముంబై కోలుకోలేదు. తర్వాతి ఓవర్లలో అమన్‌జోత్​ కౌర్, నికోలా కేరీ వికెట్లను కూడా పడగొట్టిన చరణి ఢిల్లీకి పెద్ద బ్రేక్​ ఇచ్చింది. ఇన్నింగ్స్ మొత్తంలోనూ ఒంటరిగా పోరాడిన నాట్ సివర్​–బ్రంట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని చివరి వరకూ నిలబడి కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఇన్నింగ్స్ ముగింపు దశలో సంస్కృతి గుప్తా రెండు భారీ సిక్సర్లతో స్కోరును పరుగులెత్తించి, డెత్ ఓవర్లలో ముంబైకు ఊపిరి పోసింది. చివరకు 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 154/5తో ఇన్నింగ్స్ ముగించింది. నాట్ సివర్​–బ్రంట్ 65 పరుగులతో నాటౌట్​గా నిలబడగా, చివరి ఓవర్‌లో వచ్చిన భారీ సిక్సర్లు ముంబైను పోరాడగలిగే స్థాయికి తీసుకెళ్లాయి. ముంబై బౌలర్లలో శ్రీ చరణి 3 వికెట్లు, కప్​, నందిని చెరో వికెట్​ తీసుకున్నారు.

Latest News