Site icon vidhaatha

Mumbai Indians|ముంబై టీమ్‌లో గొడ‌వ‌లా.. తెలుగ‌బ్బాయిని పాండ్యా టార్గెట్ చేశాడా…!!

Mumbai Indians| హార్ధిక్ పాండ్యా ముంబై జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌లు అందుకున్న‌ప్ప‌టి నుండి ఆ జ‌ట్టుకి గ‌డ్డుకాలం న‌డుస్తుంది అని చెప్పాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ముంబై మూడు మ్యాచ్‌లు మాత్ర‌మే గెలిచింది. ప‌ది మ్యాచ్‌ల‌లో ఏడు ఓడిపోవ‌డంతో ఆ జ‌ట్టుకి ప్లే అవ‌కాశాలు స‌న్నిగిల్లిన‌ట్టేన‌ని చెప్పాలి. అయితే పాండ్యా కెప్టెన్సీ తీసుకున్న‌ప్ప‌టి నుండి ఆ టీంలో అంత‌ర్గ‌త విభేదాలు న‌డుస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది. పాండ్యా, రోహిత్‌కి ఏ మాత్రం పొస‌గ‌డం లేద‌ని, రోహిత్ తన భార్య, ముంబై ఇండియన్స్ సహచరులతో కలిసి బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకున్న‌ప్పుడు హార్ధిక్ హాజ‌రు కాలేద‌ని అనేక వార్త‌లు నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి.

ఒక‌వైపు రోహిత్, పాండ్యా మ‌ధ్య ఫైట్ గురించి తీవ్ర‌మైన డిస్క‌షన్ న‌డుస్తున్న స‌మ‌యంలో కొత్త‌గా తెలుగబ్బాయి తిలక్ వర్మ-హార్ధిక్ పాండ్యా మ‌ధ్య పెద్ద ఫైట్ జ‌రిగినట్టు తెలుస్తుంది. ‘హిట్‌మేనియా 45’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో దీనికి సంబంధించి షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఇటీవ‌ల ఢిల్లీతో జ‌రిగిన మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ ఓడింది. ఆ త‌ర్వాత తిల‌క్, పాండ్యా ఇద్ద‌రు గొడ‌వ‌ప‌డ్డ‌ట్టు స‌మాచారం. హార్ధిక్ బహిరంగంగానే తిల‌క్‌పై విమ‌ర్శ‌లు కురిపించ‌డంతో ఈ గొడ‌వ జ‌రిగిందని అంటున్నారు. గొడ‌వ తారాస్థాయికి చేర‌డంతో రోహిత్‌తో పాటు కొంద‌రు ఆట‌గాళ్లు క‌ల‌గ‌జేసుకొని స‌ర్ధి చెప్పినట్టు టాక్.

ఢిల్లీపై ఓటమి తర్వాత, హార్దిక్ ఒక ఇంటర్వ్యూలో తిలక్ పేరు చెప్పకుండా అతనిపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు కురిపించాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌పై తిలక్ దూకుడుగా ఆడకపోవడం వ‌ల్ల‌నే తమ జట్టు ఓట‌మి పాలైంద‌ని హార్ధిక్ అన్నాడు. ఈ విష‌యం గురించి డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా హార్ధిక్ ప్ర‌స్తావ‌న తీసుకురావ‌డంతో గొడ‌వ చాలా పెద్ద‌దైంద‌ని అంటున్నారు. ఈ గొడవతో ముంబై జ‌ట్టులో చీలిక‌లు ఏర్ప‌డ్డాయ‌ని తెలుస్తుంది. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ముంబై ఇండియన్స్ జట్టు వివాదాల్లో నిలుస్తూనే ఉండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఆటతీరు కంటే నాయకత్వ మార్పు , ప‌లు వివాదాల‌తో ముంబై ఇండియ‌న్స్ హాట్ టాపిక్ అవుతుంది.

Exit mobile version