SRH vs RCB|నిల‌వాలంటే గెల‌వాలి.. స్వప్నిల్ సింగ్ ఆల్‌రౌండ్ షోతో గ‌ట్టెక్కిన ఆర్సీబీ

SRH vs RCB|ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వ‌రుస ప‌రాజ‌యాల‌కి చెక్ పెట్టింది. నిల‌వాలంటే గెల‌వాల్సిన మ్యాచ్‌లో మంచి విజ‌యం సాధించింది.స్వప్నిల్ సింగ్ ఆల్‌రౌండ్ షోతో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై ఆర్‌సీబీ 35 పరుగుల తేడాతో గెలుపొందింది. గత మ్యాచ్‌లో బెంగళూరు త

  • Publish Date - April 26, 2024 / 06:32 AM IST

SRH vs RCB|ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వ‌రుస ప‌రాజ‌యాల‌కి చెక్ పెట్టింది. నిల‌వాలంటే గెల‌వాల్సిన మ్యాచ్‌లో మంచి విజ‌యం సాధించింది.స్వప్నిల్ సింగ్ ఆల్‌రౌండ్ షోతో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై ఆర్‌సీబీ 35 పరుగుల తేడాతో గెలుపొందింది. గత మ్యాచ్‌లో బెంగళూరు తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌తో తలపడగా, ఆ మ్యాచ్‌లో హైద‌రాబాద్ బ్యాట్స్‌మెన్స్ విధ్వంసం సృష్టించారు. దీంతో 20 ఓవ‌ర్ల‌లోనే 287 ప‌రుగుల భారీ స్కోరు చేశారు. ఇది ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక స్కోరు. ఇక ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆట‌గాళ్లు కూడా బాగానే ఆడారు. 262 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్‌లో ఓడిపోయారు

అయితే ఆ మ్యాచ్ త‌ర్వాత ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్ జ‌ట్లు హైద‌రాబాద్ ఉప్ప‌ల్ వేదిక‌గా త‌ల‌ప‌డ్డారు. సొంత మైదానంలో స‌న్‌రైజ‌ర్స్ మ‌రో మ్యాచ్ గెల‌వ‌డం ఖాయం అనుకున్నారు. కాని తీరా చూస్తే ఆర్సీబీకి మంచి విజ‌యం ద‌క్కింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆర్సీబీ. విరాట్ కోహ్లీ(43 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 51), రజత్ పటీదార్(20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. కామెరూన్ గ్రీన్(20 బంతుల్లో 5 ఫోర్లతో 37 నాటౌట్) చివ‌ర్లో కాస్త మెరుపులు మెరిపించాడు. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ స్వ‌ప్నిల్ సింగ్ (6 బంతుల్లో 12ప‌రుగులు ) చేశాడు. ఈ క్ర‌మంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 206 పరుగులు చేసింది.

207 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మొద‌ట్లోనే పెద్ద దెబ్బ త‌గిలింది విల్ జాక్స్ వేసిన తొలి ఓవర్‌లోనే విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్(1) క్యాచ్ ఔట్‌గా పెవీలియ‌న్ బాట ప‌ట్డాడు. ఆ త‌ర్వాత అభిషేక్ శర్మ(31) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెల‌రేగే ప్ర‌య‌త్నం చేసిన ఎక్కువ సేపు నిల‌వ‌లేదు. స్వప్పిల్ సింగ్ అద్భుత‌మైన బౌలింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అతను వేసిన లడ్డూ లాంటి ఫుల్‌టాస్‌కు మార్క్‌రమ్(7) ఎల్బీగా వెనుదిర‌గ‌డం విశేషం. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్లాసెన్(7) ఔటయ్యాడు. తెలుగ‌బ్బాయి నితీష్ కుమార్ రెడ్డి (13) ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. 10 ఓవర్లలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్లు కోల్పోయి క‌ష్టాల‌లో ప‌డింది. ఆ స‌మ‌యంలో క‌మ్మిన్స్(15 బంతుల్లో 31) భారీ సిక్స్‌లతో ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన‌ అతని జోరుకు కామెరూన్ గ్రీన్ బ్రేక్ వేసాడు. దీంతో ఆర్సీబీ విజ‌యం లాంచ‌నమైంది.

Latest News