RCB vs RR| వ‌రుస విజ‌యాల‌కి బ్రేక్.. రాజ‌స్థాన్‌పై ఓట‌మితో టోర్నీ నుండి ఆర్సీబీ ఔట్

RCB vs RR| రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ కల మ‌ళ్లీ చెదిరింది. 16 సార్లు క‌ప్ కోసం ఎంతో ప్ర‌య‌త్నించ‌గా, అది సాధ్య‌ప‌డ‌లేదు. ఈ సారైన క‌ల నెర‌వేరుతుందేమోన‌ని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూశారు. కాని ఆర్సీబీకి ఆర్ఆర్ చెక్ పెట్ట‌డంతో టోర్నీ నుండి నిరాశ‌గా నిష్క్ర‌మించ‌క త‌ప్ప‌లేదు. ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో భాగంగా ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ జ‌ట్టు నాలుగు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.ఈ క్ర‌మంలో క్వాలిఫయర్-2కు సంజూ శాంసన్ సేన దూసుకెళ్లింది. ఇక స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో ఆర్ఆర్ పోటీ ప‌డ‌నుండ‌గా, ఇందులో ఎవ‌రు గెలుస్తారో వారు నేరుగా ఫైన‌ల్‌లో కేకేఆ

  • Publish Date - May 23, 2024 / 06:19 AM IST

RCB vs RR| రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ కల మ‌ళ్లీ చెదిరింది. 16 సార్లు క‌ప్ కోసం ఎంతో ప్ర‌య‌త్నించ‌గా, అది సాధ్య‌ప‌డ‌లేదు. ఈ సారైన క‌ల నెర‌వేరుతుందేమోన‌ని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూశారు. కాని ఆర్సీబీకి ఆర్ఆర్ చెక్ పెట్ట‌డంతో టోర్నీ నుండి నిరాశ‌గా నిష్క్ర‌మించ‌క త‌ప్ప‌లేదు. ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో భాగంగా ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ జ‌ట్టు నాలుగు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.ఈ క్ర‌మంలో క్వాలిఫయర్-2కు సంజూ శాంసన్ సేన దూసుకెళ్లింది. ఇక స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో ఆర్ఆర్ పోటీ ప‌డ‌నుండ‌గా, ఇందులో ఎవ‌రు గెలుస్తారో వారు నేరుగా ఫైన‌ల్‌లో కేకేఆర్‌ని ఢీకొంటారు.

ఆర్ఆర్ జ‌ట్టు అసాధారణ ప్రదర్శనతో అద్భుత విజ‌యం సాధించింది అని చెప్పాలి. ఈ గెలుపుతో చెన్నై వేదికగా శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఇక గ‌త రాత్రి జ‌రిగిన మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33), రజత్ పటీదార్(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34), మహిపాల్ లోమ్రోర్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్) మాత్ర‌మే కాస్త జ‌ట్టుకి విలువైన ప‌రుగులు అందించారు. మిగ‌తా బ్యాట్స్‌మెన్స్ అంతా తేలిపోయారు. పావెల్ క‌ళ్లు చెదిరే క్యాచ్ ప‌ట్టడంతో డుప్లెసిస్ త్వ‌ర‌గానే పెవీలియ‌న్ బాట ప‌ట్టాల్సి వ‌చ్చింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్(3/44) మూడు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ రెండు వికెట్లు తీసాడు. యుజ్వేంద్ర చాహల్, ఆవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ తలో వికెట్ తీసారు.

ఇక స్వ‌ల్ప ల‌క్ష్య చేధ‌న‌లో భాగంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆచితూచి ఆడింది. ఈ క్ర‌మంలో 19 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసి మంచి విజయాన్నందుకుంది. యశస్వి జైస్వాల్(30 బంతుల్లో 8 ఫోర్లతో 45), రియాన్ పరాగ్(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36), షిమ్రాన్ హెట్‌మైర్(14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26) జ‌ట్టుకి విలువైన ప‌రుగుగు అందించారు. చివర్లో రోవ్‌మన్ పోవెల్(8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 16 నాటౌట్) మెరుపులు మెరిపించ‌డంతో ఆర్ఆర్ జ‌ట్టు సునాయాస విజయాన్ని అందుకుంది. ఆర్‌సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(2/33) రెండు వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, కర్ణ్ శర్మ, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ తీసారు.

Latest News