Site icon vidhaatha

డూప్లికేట్ అశ్విన్‌తో ఆడి భార‌త్‌పై గెల‌వాల‌ని ఆసీస్‌ ప్లాన్.. కానీ పెద్ద షాక్ ఇచ్చాడుగా..!

మ‌రో మూడు రోజుల్లో వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మ‌రం మొద‌లు కానున్న విషయం తెలిసిందే. ప్ర‌తి ఒక్క టీం కూడా ట్రోఫీ గెల‌వాల‌ని క‌సిగా ఉంది. ఈ సారి ఫైట్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా ఉండ‌నుండ‌గా, భార‌త్ టైటిల్ ఫేవ‌రేట్‌గా బ‌రిలోకి దిగుతుంది. అయితే ఇప్ప‌టికే చాలాసార్లు వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ అందుకున్న ఆసీస్ ఈసారి ఆరో టైటిల్ కోసం ఆశగా బరిలో దిగుతోంది.



ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న ఆస్ట్రేలియా, అక్టోబర్ 8న చెన్నైలో టీమిండియాని ఢీకొట్ట‌బోతుంది. సాధార‌ణంగా చెన్నై పిచ్ అంటే స్పిన్న‌ర్ల‌కి చాలా చ‌క్క‌గా అనుకూలిస్తుంది. ఆ మ్యాచ్‌లో అశ్విన్, కుల్దీప్ యాద‌వ్ ఆసీస్ స్పిన్న‌ర్ల‌ని త‌ప్ప‌క ఇబ్బంది పెడ‌తారు.




ఇది గ్ర‌హించిన ఆస్ట్రేలియా టీం అశ్విన్ కార్భన్ కాపీలా బౌలింగ్ చేసే బరోడా బౌలర్ మహేష్ పిథియాని నెట్ బౌలర్‌గా నియమించుకోవాలని ట్రై చేసింది. మహేష్ బౌలింగ్ స్టైల్ అచ్చం అశ్విన్ తరహాలో ఉండ‌డంతో ఆయ‌న బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తే మ్యాచ్ లో ఆడ‌డం సులువు అవుతుంద‌ని అనుకున్నారు.




ప్రపంచకప్‌కు ముందే బరోడా యంగ్ స్పిన్నర్‌ను పిలిపించుకునేందుకు ఆసీస్ జట్టు కాగా, వారి ఆఫ‌ర్‌ని మ‌హేష్ ఫిథియా సున్నితంగా తిర‌స్క‌రించాడు. గతసారి భారత్‌లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా ఆస్ట్రేలియా జట్టు నెట్ సెషన్స్‌లో మహేష్ పిథియా బౌలింగ్‌తోనే ఆస్ట్రేలియా జ‌ట్టు నెట్‌ ప్రాక్టీస్‌ చేసింది.




మ‌హేష్ ఆసీస్ ఆఫ‌ర్ రిజెక్ట్ చేయ‌డానికి కార‌ణం ప్ర‌స్తుతం మ‌నోడు దేశ‌వాళి మ్యాచ్‌ల‌తో బిజీగా ఉన్నాడు.వర‌ల్డ్ క‌ప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా నెట్ బౌలర్‌గా రావాలని నాకు ఆఫ‌ర్ వ‌చ్చింది. అది మంచి ఆఫ‌ర్ అయిన కూడా ప్ర‌స్తుతం దేవ‌వాళీ టోర్నీలో భాగంగా బ‌రోడా కోసం ఆడుతున్నాను. ఈ నేప‌థ్యంలో టీమ్‌కి దూరంగా ఉండడం క‌రెక్ట్ కాద‌ని ఆసీస్ ఇచ్చిన ఆఫ‌ర్ తిరస్క‌రించిన‌ట్టు చెప్పుకొచ్చాడు.




అక్షర్ పటేల్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ని సెలక్ట్ చేస్తున్నట్టు ఎప్పుడైతే బీసీసీఐ ప్ర‌క‌టించిందో అప్పుడు నాకు కాల్ వ‌చ్చింది. అంత‌ర్జాతీయ టీమ్స్‌తో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం చాలా గొప్ప అవ‌కాశం అయిన‌ప్ప‌టికీ, దేశ‌వాళీ టోర్నీల‌కి అందుబాటులో ఉండ‌డం కూడా నా క‌ర్త‌వ్యం. అశ్విన్‌ని క‌లిసిన వెంట‌నే నేను ఆయ‌న పాదాల‌కి న‌మ‌స్క‌రించి ఆశీర్వాదం తీసుకున్నాను. నా రోల్ మోడ‌ల్ అత‌నే అని ఈ బ‌రోడా ప్లేయ‌ర్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version