U19 CWC: IND vs ZMB | మల్హోత్రా సెంచరీతో భారత్ విజయం… కివీస్​పై పాక్​ దూకుడు

2026 అండర్-19 వరల్డ్‌కప్‌లో మల్హోత్రా సెంచరీతో భారత్ జింబాబ్వేపై భారీ విజయం సాధించగా, సమీర్ మిన్హాస్ అజేయ ఇన్నింగ్స్‌తో పాకిస్థాన్ న్యూజిలాండ్‌పై సునాయాసంగా గెలిచింది.

U19 World Cup 2026 India vs Zimbabwe Vihaan Malhotra Century Celebration

U19 World Cup: Malhotra Ton Powers India, Pakistan Crush New Zealand

2026 అండర్-19 వరల్డ్‌కప్ సూపర్ సిక్స్ దశలో భారత్, పాకిస్థాన్ జట్లు భారీ విజయాలతో దూసుకెళ్లాయి. జింబాబ్వేపై భారత్ 204 పరుగుల తేడాతో గెలవగా, న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో సులువుగా విజయం సాధించింది. ఈ రెండు విజయాలు టోర్నీలో భారత్–పాక్ హై వోల్టేజ్ మ్యాచ్‌కు మరింత ఆసక్తి పెంచాయి.

భారత్ ఆల్​రౌండ్​ ప్రతిభ… ఠారెత్తిన జింబాబ్వే

U19 CWC: IND vs ZMB | భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోరు చేసింది. విహాన్ మల్హోత్రా 109 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయానికి బాటలు వేశాడు. అభిగ్యాన్ కుందు (61), వైభవ్ సూర్యవంశీ (52) అర్థశతకాలతో అద్భుతంగా సహకరించారు. సూర్యవంశీ కేవలం 24 బంతుల్లో అర్ధసెంచరీ సాధించి టోర్నీలో వేగవంతమైన ఫిఫ్టీల్లో ఒకటిగా నిలిపాడు. చివరి ఓవర్లలో ఖిలాన్ పటేల్ వేగంగా పరుగులు రాబట్టి స్కోరును 350 దాటించాడు.

బౌలింగ్‌లో కెప్టెన్ ఆయుష్ మాథ్రే , ఉధవ్ మోహన్ చెరో 3 వికెట్లు తీసుకోగా, ఆర్.ఎస్. అంబరీశ్ 2 వికెట్లు తీసుకున్నాడు. వీరు ముగ్గురు జింబాబ్యేను ఊపిరి కూడా తీసుకోనివ్వలేదు.

మిన్హాస్ మెరుపులున్యూజిలాండ్‌పై పాక్ సునాయాస విజయం

U19 CWC: PAK vs NZ | కాగా, మరో మ్యాచ్​లో న్యూజిలాండ్‌ను పాకిస్థాన్ బౌలర్లు 110 పరుగులకే ఆలౌట్ చేశారు. సుభాన్ (4/11), రజా (3/36) అద్భుతంగా బౌలింగ్ చేశారు.

తర్వాత బ్యాటింగ్‌లో సమీర్ మిన్హాస్ 76 పరుగులతో అజేయంగా నిలిచి పాక్‌కు అలవోక విజయాన్ని అందించాడు. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలో 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇంకా 32 ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్ ముగిసింది.

ఈ విజయంతో పాకిస్థాన్ నెట్ రన్‌రేట్ భారీగా మెరుగైంది. భారత్, పాకిస్థాన్ జట్లు ఈ విజయాలతో సూపర్ సిక్స్ దశలో తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. ఇకపై రాబోయే భారత్–పాక్ మ్యాచ్ టోర్నీకి ప్రధాన ఆకర్షణగా మారనుంది.

Latest News