Site icon vidhaatha

Vinesh Phogat Retirement | వినేశ్‌ ఫోగాట్‌ సంచలన నిర్ణయం.. ఒలింపిక్స్‌ అనంతరం రెజ్లింగ్‌కు గుడ్‌బై..!

Vinesh Phogat Retirement | పారిస్‌ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌ ఫైనల్‌ పోరులో అనర్హత వేటు పడిన భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ సంచలన నిర్ణయం తీసుకున్నది ఒలింపిక్స్‌ అనంతరం రెజ్లింగ్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో యావత్‌ క్రీడాభిమానులు, ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ మేరకు రిటైర్‌మెంట్‌ను ఎక్స్‌వేదికగా ప్రకటించింది. వాస్తవానికి ఒలింపిక్స్‌లో ఫైనల్‌లో వినేశ్‌ ఫైనల్‌కు చేరుకుంది. బంగారం పతకం కోసం తలపడాల్సి ఉండగా వంద గ్రాముల బరువు అధికంగా ఉండడంతో అనర్హత వేటు వేశారు. దీంతో యావత్‌ భారత దేశ పౌరులతో పాటు అభిమానులందరినీ ఇది షాక్‌కు గురి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు సైతం వినేశ్‌కు అండగా నిలిచారు.

అయితే, దీని వెనుక ఏమైనా కుట్ర కోణం ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, ఓ వైపు అనర్హత వేటుపై చర్చలు కొనసాగుతున్న తరుణంలోనే వినేశ్‌ రిటైర్మ్‌పై సంచలన నిర్ణయం తీసుకున్నది. అనర్హతతో భావోద్వేగానికి గురైన 29 ఏళ్ల రెజ్లర్ వినేశ్‌ తన తల్లిని గుర్తు చేసుకొని ఆమె క్షమాపణలు చెప్పింది. ‘అమ్మ, రెజ్లింగ్ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను. క్షమించండి. నీ కల, నా ధైర్యం చెడిపోయింది. ఇంకా ఇప్పుడు నాకు బలం లేదు’ అంటూ ట్వీట్‌ చేసింది. ఈ సందర్భంగా మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఎంతో భవిష్యత్‌ ఉన్న వినేశ్‌ ఫోగాట్‌ అర్ధాంతరంగా రెజ్లింగ్‌కు గుడ్‌బై పలకడం అందరినీ ఆవేదన గురి చేస్తున్నది. ఇదిలా ఉండగా.. 50 కేజీల ఫ్రీ స్టయిల్‌ రెజ్లింగ్ ఫైనల్‌కు వెళ్లిన వినేష్ ఫోగట్ అధిక బరువుతో అనర్హత వేటు పడగా.. నిరాశకు గురైన వినేశ్‌ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌కు అప్పీల్ చేసుకున్నది. తనకు సిల్వర్ మెడల్ ఇవ్వాల్సిందిగా కోరింది. ఆర్బిట్రేషన్‌ కోర్టు ఇవాళ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నది.

Exit mobile version