Snakes in Basement | సాధారణంగా పాములు అడవుల్లో ఉంటాయి. పొరపాటున అప్పుడప్పుడు దారి తప్పి జనావాసాల్లోకి ప్రవేశిస్తుంటాయి. ఇక వాటిని చూసిన మనుషులు కంగారెత్తిపోతుంటారు. ఒక్క పామును చూస్తేనే హడలెత్తిపోయేవారికి ఏకంగా డజన్‌లకుపైగా పాములు ఒక్కసారే.. అదీ ఒక కుప్పలా కనిపిస్తే? గుండెలాగిపోవు? ఇలాంటి అనుభవమే ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ జిల్లా హర్దీదాలి గ్రామవాసులకు ఎదురైంది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ పాముల కుప్ప వీడియో.. ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ఊళ్లోని ఒక ఇంటి బేస్‌మెంట్‌లో చుట్టుకుని ఉన్న పదికిపైగా పాములను (Snakes in Basement) గమనించిన స్థానికులు.. భయంతో పరుగులు తీశారు.
ఈ ఉదంతాన్ని భారత్ సమాచార్ అనే స్థానిక మీడియా వెలుగులోకి తెచ్చింది. పక్షులు కట్టుకునే గూళ్ల తరహాలో డజన్ల కొద్దీ పాములు (snakes) చుట్టుకుని ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. గ్రామస్థులు వెంటనే ఆత్మరణ చర్యలు తీసుకోవడంతోపాటు.. ఈ విషయాన్ని పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు. సదరు స్థానిక మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆ వీడియో.. చీకట్లో చుట్టుకుపోతున్న పాములను చూపుతుంది. ఆ సర్పాలు.. ఎక్కడికీ పోకుండా.. మెల్లగా ఒకదానికి ఒకటి చుట్టుకుపోతూ కనిపించాయి.
ఉత్తరప్రదేశ్‌లో పాముల సంచారం, ప్రాణాంతక పాము కాట్లు చోటుచేసుకుంటూనే ఉంటాయి. గత నెలలో దుధ్వా టైగర్ రిజర్వ్‌కు (dudhva tiger reserve) 125 కిలోమీటర్ల దూరంలో లఖింపూర్ ఖేరీ జిల్లాలో అరుదైన పొడవాటి వైన్‌స్నేక్ దర్శనమించింది. ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పొడవాటి నోటితో ఉండే ఈ పాము.. చెట్లపొదల్లో పట్టిపట్టి చూస్తేగానీ కనిపించనంత పచ్చగా ఉంటుంది. మరో ఘటనలో ఒక యూపీ వ్యక్తి మెడలో ఒక పామును వేసుకుని ఆటలాడుతుంటే.. అది కాటు వేసింది. షాజహాన్‌పూర్‌లోని బాందా ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషం తీవ్రతతో అతడు చనిపోయాడు. మీరట్‌లోని అక్బార్‌పూర్ సాదత్ గ్రామంలో ఒక వ్యక్తిని నాగుపాము (Cobra) కాటేసింది. దాంతో అతడు చనిపోయాడు. అయినా అతడిని చుట్టుకునే ఉన్న నాగుపాము.. మొత్తం పదిసార్లు కాటు వేసిందని గుర్తించారు.
ఇదే ఆ వీడియో..
ఇవి కూడా చదవండి..
Babies and Snakes | పాముల మధ్య బుజ్జిపాపాయిలా? ఇదేం ప్రయోగంరా నాయనా.. (వీడియో)
Snake Dens | దాదాపు లక్షన్నర పాములు ‘కలిసే’ అతిపెద్ద ‘పాముల జాతర’ ఎక్కడో తెలుసా?
King Cobra | ఈ పామును చూస్తే.. మీకు రాత్రి నిద్ర కూడా పట్టదు!
King Cobra | వామ్మో.. పాము నీళ్లు ఎలా తాగుతుందో చూడండి!