Site icon vidhaatha

Snake Dens | దాదాపు లక్షన్నర పాములు ‘కలిసే’ అతిపెద్ద ‘పాముల జాత‌ర’ ఎక్కడో తెలుసా?

Snake Gathering | ఒక పామును చూస్తేనే భయం వేస్తుంది. అలాంటి వంద పాములు కనిపిస్తే గుండె గుభేల్మనక తప్పదు.. అదే 75వేల నుంచి లక్షన్నర వరకూ పాములు ఒకే ప్రాంతంలో గుట్టలు గుట్టలుగా.. కుప్పలు కుప్పలుగా కనిపిస్తే? అదే ప్రకృతి గొప్పతనం. ఈ భూప్రపంచంపై వింతలకు కొదవలేదు. ప్రతి ప్రాంతంలో, ప్రతి జీవిలో అనేక ప్రత్యేకతలు, అద్భుతాలు ఉంటాయి. కెనడాలోని నార్సిస్సే పట్టణం కూడా ఇలాంటి ఒక అద్భుత దృశ్యానికి ఏడాదికొకసారి వేదిక అవుతుంటుంది. ఇక్కడ దాదాపు 75వేల నుంచి లక్షన్నర వరకూ పాములు ఒక్కసారిగా బయటకు వస్తూ ఉంటాయి. ప్రధానంగా ఈస్ట్రన్‌ గార్టర్‌ స్నేక్స్‌ శీతాకాలం ముగియగానే తమ పుట్టల్లోంచి బయటకు వచ్చి ఇలా ఒక్క చోటుకు చేరి, తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటాయి. ప్రతి వసంతకాలంలో చోటుచేసుకునే ఈ అద్భుతం కోసం పర్యాటకులు, ప్రత్యేకించి జంతు శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

ఈ రెడ్‌ సైడెడ్‌ గార్టర్‌ స్నేక్స్‌.. తమ ఆడ తోడును సాధించుకునేందుకు తోటి మగ పాములతో పోరాడుతాయట. ఈ పోరాటాన్ని మేటింగ్‌ బాల్‌ అని శాస్త్రవేత్తలు పిలుస్తారు. కెనడాలో శీతాకాలం అంటే చెప్పనక్కర్లేదు. ఈ చల్లదనం నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఈ ప్రాంతంలోని సున్నపురాయి గనుల్లోని పగుళ్లలో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుని, శీతాకాలం ముగిసేదాకా అక్కడే నిద్రాణ స్థితిలో ఉంటాయి. అలాగైతేనే అవి శీతాకాలాన్ని తట్టుకోగలవు. వసంతకాలం వచ్చిందంటే వాటికి సంబరమే. ముందుగా మగపాములు బొరియల నుంచి ఆడతోడుకు వెతుక్కుంటూ బయటకు వస్తాయి. ఆడ పాములు వాటిని అనుసరిస్తాయి. అక్కడ నుంచి ఇక భీకర సంభోగ పర్వం మొదలవుతుంది. ఆడ పాములను గుర్తించేందుకు మగ పాములు ఫెరోమోన్‌లను.. ఒక రకమైన మదపు సువాసనలను ఉపయోగిస్తాయి. ఆ సమయంలో ఇతర మగ పాములను ఓడించి.. ఆడ తోడును పొందుతాయి.

NDSA | రజతోత్సవ నాయకుడిపై ‘కాళేశ్వరం’ నీలినీడలు!

కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి దట్టమైన స్నేక్‌ డెన్స్‌ రోడ్లపై ట్రాఫిక్‌ కారణంగా తీవ్ర ఇబ్బందికి గురవుతున్నాయి. ఆడతోడు వెతుక్కుంటూ బయటకు వచ్చిన పాములు హైవే 17 మీద వేల సంఖ్యలో వాహనాల కిందపడి చనిపోయేవి. రెడ్‌ సైడెడ్‌ గార్టర్‌ పాముల ఉనికికి ఇదొక ప్రధాన ముప్పుగా తయారైంది. ఈ ముప్పును నివారించేందుకు ప్రకృతి సంరక్షకులు గట్టి చర్యలు తీసుకున్నారు. పాములు రోడ్డు మీదకు రావాల్సిన అవసరం లేకుండా.. హైవే కింద ప్రత్యేకంగా సొరంగాలు తవ్వించారు. తమ డెన్స్‌కు సురక్షితంగా వెళ్లేందుకు సొరంగాల నుంచి మార్గం సుగమం చేస్తూ చానల్‌ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ పాముల మరణాలు గణనీయంగా తగ్గిపోయాయి. అదే సమయంలో పాముల సంతతి కూడా బాగా పెరిగింది. మరిన్ని దశాబ్దాలు వీటికి ఎలాంటి ముప్పు లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రకృతిని రక్షిస్తే అరుదైన జీవజాలం తమ ఉనికిని కాపాడుకుంటుందనేందుకు నార్సిస్సే పాముల జాతర ఉదాహరణగా నిలిచిపోతున్నది.

ఇవి కూడా చదవండి..

Dal Lake Shikara | ఉగ్రవాదాన్ని ఎదిరించిన మహిళ.. దాల్‌ లేక్‌లో బోట్‌ షికార్‌!
Shakti Dubey | మూడు సార్లు ప్రిలిమ్స్‌లో ఫెయిలై.. ఆరో ప్ర‌య‌త్నంలో ఆలిండియా ఫ‌స్ట్ ర్యాంక్.. శ‌క్తి దూబే స‌క్సెస్ స్టోరీ ఇది..!
Vastu Tips | అద్దానికి కూడా వాస్తు నియ‌మాలున్నాయి..! అవేంటో తెలుసా..?

Exit mobile version