Babies and Snakes | ఆకలేస్తే ఏడవడం.. సంతోషం కలిగితే నవ్వడం ఈ రెండే తెలుసు బుజ్జిపాపాయిలకు. అమ్మ బూచ్.. అంటూ భయపెట్టాలని ప్రయత్నిస్తే కూడా బోసి నవ్వులు నవ్వేయడమే వారికి తెలుసు. అలాంటి.. ఇంకా బుడిబుడి అడుగులు కూడా వేయలేని చిన్నారుల మధ్య రెండు పాములను వదిలిపెట్టి ఆడుకోమంటే.. ! అమ్మో.. ఇంకేమన్నా ఉందా? పాముల మధ్య బుజ్జి పాపాయిలా! ఊహించడానికే భయంగా ఉంది కదూ! కానీ.. నిజంగానే చిన్నారుల మధ్య రెండు పాములను వదిలేసి ఆడుకోమని చెప్పిన ఒక వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తున్నది. పాముల మధ్య చిన్నారులు ఆడుకుంటుంటే.. ఆ దృశ్యాన్ని తల్లిదండ్రులు భయం భయంగా చూస్తున్న ఆ వీడియోపై కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు తలకాయ లేదా? అంటూ తిట్టి పోస్తున్నారు.
ప్రయోగాత్మక వీడియో ఇది..
పిల్లలు పాములను చూసి భయపడతారా? అనే అంశంలో ప్రయోగాత్మంగా తీసిన వీడియో ఇది. ఆ వీడియో చిన్నారులు ఏ మాత్రం భయపడకుండా ఆ పాములను పట్టుకోవడం కనిపిస్తుంది. చూస్తే ఒల్లు జలదరించే ఈ వీడియో.. చిన్నారులు పాములంటే సహజంగా భయపడరని నిరూపించేందుకు ఉద్దేశించినది. ఆ వీడియోలో చిన్నారులు ఆ పాములంటే భయపడటం కంటే ఆసక్తిగా వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది. వారిని చూస్తున్న తల్లిదండ్రులు మాత్రం తీవ్ర ఉత్కంఠకు లోనవుతూ ఉంటారు. పాములు ప్రమాదకరమనే కోడ్ పెద్దవాళ్లలో, కనీసం ఊహ తెలిసినవాళ్ల మెదళ్లలో నిక్షిప్తమైపోయి ఉంటుంది కనుక వారు పాములను చూసి భయపడతారు. కానీ.. చిన్నారులకు ఆ ఊహ లేని కారణంగా వాటిని కూడా ఆటబొమ్మలేననే భావనతో ఉంటారు. సరిగ్గా ఆ వీడియోలో సైతం ఇదే కనిపిస్తుంది. ఇదే విషయాన్ని రుజువు చేసేందుకు ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (ఏబీసీ)లో ప్రసారమైన సీక్రెట్ సైన్స్ ఎపిసోడ్‌లో ఈ ప్రయోగం చేపట్టారు. అయితే.. ముందు జాగ్రత్త చర్యగా విషపూరితం కాని పాములను ఆ ప్రయోగానికి ఎంచుకున్నారు. అవికూడా శిక్షణ పొందిన పాములు.
Seeing if human babies are afraid of snakes. pic.twitter.com/YBoUbU2QUl
— Fascinating (@fasc1nate) May 7, 2025
నెటిజన్ల మిశ్రమ స్పందన
ఈ వీడియో ఎక్స్‌లో ఇప్పటికే లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇదొక ప్రమాదకరమైన క్రీడ అని ఒకరు రాశారు. ఈ పాములకు అప్పటికే ఆహారం అందించి ఉంటారని, అందుకే అవి కామ్‌గా ఉన్నాయని మరొకరు కామెంట్ చేశారు. ఏ ఒక్క పామైనా ఆకలితో ఉంటేనా? అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది బాధ్యతారాహిత్యం అంటూ మరొకరు ఆగ్రహించారు. ఏది ఏమైనా ఈ ప్రయోగం ఆసక్తికరంగా ఉందని కొందరు వ్యాఖ్యానించారు.
ఇవికూడా చదవండి..
Outsourcing Employees | తెలంగాణలో ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు సర్కారీ మేత.. ఇదిగో లెక్క!
Snake Dens | దాదాపు లక్షన్నర పాములు ‘కలిసే’ అతిపెద్ద ‘పాముల జాతర’ ఎక్కడో తెలుసా?
King Cobra, Mongoose Fight | కింగ్ కోబ్రా, తెల్ల తోక ముంగిస మధ్య ఫైట్‌లో గెలిచేదేంటి?
Tectonic Interactions | మీరు నమ్మలేరు.. రెండు ముక్కలుగా చీలనున్న భారతదేశం!
Global Warming | గ్లోబల్ వార్మింగ్‌తో విస్తరించే ప్రాణాంతక ఫంగస్! 33 శాతానికిపైగా మరణాల రేటు!