Site icon vidhaatha

King Cobra, Mongoose Fight | కింగ్ కోబ్రా, తెల్ల తోక ముంగిస మ‌ధ్య ఫైట్‌లో గెలిచేదేంటి?

King Cobra, Mongoose Fight |

కింగ్ కోబ్రా, తెల్ల తోక ముంగిస రెండూ.. అత్యంత ప్ర‌మాద‌క‌ర జీవులు. వాటి ప్ర‌త్యేక‌త‌లు, సామ‌ర్థ్యాలు ప్ర‌కృతిలో వాటిని భిన్నంగా నిలుపుతున్నాయి. ఈ రెండింటికీ అస్స‌లు ప‌డ‌దు. రెండూ ఎదురైతే భీక‌ర పోరాట‌మే సాగుతుంది. మీకు గుర్తుంటే.. మీ చిన్న‌ప్పుడు వీధిలోకి వ‌చ్చిన పాములోడు.. చివ‌రిలో పాము, ముంగిస ఫైట్ పెడ‌తానంటాడు.. చివ‌రికు ఆ ముచ్చ‌టే లేకుండా ముగిస్తాడు. పాము, ముంగిస ఫైట్ అంటే అందరికీ అంత ఆస‌క్తి. నిజానికి ఆ రెండూ ఎదురుప‌డితే ఏది గెలుస్తుంది? దీనికి ముందు కింగ్ కోబ్రా బ‌యోడాటాను, ముంగిస బ‌యోడాటాను ఒక‌సారి ప‌రిశీలిద్దాం.

ఎక్కువ మంది చదివిన వార్త..  ఇది కూడా చదవండి..

Snakes Bath | పాములకు లాల పోస్తున్న మహిళ.. వీడియో వైరల్‌!

కింగ్ కోబ్రాలు సాధార‌ణంగా 12 నుంచి 19 అడుగుల వ‌ర‌కూ పెరుగుతాయి. సుమారు 8 నుంచి 9 కేజీల బ‌రువు ఉంటాయి. ముంగిస‌లు 103 సెంటీమీట‌ర్ల వ‌ర‌కూ గ‌రిష్ఠంగా పొడ‌వు పెరుగుతాయి. వీటి బ‌రువు నాలుగు నుంచి ఐదు కిలోల మ‌ధ్య ఉంటుంది. వేగం, లాఘ‌వం విష‌యానికి వ‌స్తే.. పాములు క్విక్‌గా స్పందిస్తాయి.. కానీ.. చురుకుగా ఉండ‌వు. కానీ.. తెల్ల తోక ముంగిస‌లు మాత్రం అటు అత్యంత‌ వేగంగా స్పందించ‌డ‌మే కాకుండా లాఘ‌వంగా కూడా ఉంటాయి. వాస‌న‌ను ప‌సిగ‌ట్ట‌డంలో దిట్ట కింగ్ కోబ్రా. కానీ. ఓవ‌రాల్‌గా చుర‌కుగా ఉండ‌దు. కానీ ముంగిస మాత్రం చిటుక్కుమ‌న్నా వినేయ‌గ‌ల‌దు, ప‌దునైన చూపు క‌లిగి ఉంటుంది. అదే విధంగా వాస‌న‌లు కూడా బాగా ప‌సిగ‌ట్ట‌గ‌ల‌దు. త‌ద్వారా ప్ర‌మాదాల‌ను ప‌సిగ‌ట్ట‌డం, ఎదుర్కొన‌డం చేస్తుంది.

ఎక్కువ మంది చదివిన వార్త.. ఇది కూడా చదవండి

Karre Guttala | కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 28 మంది మృతి?

విషం విష‌యానికి వ‌స్తే.. కింగ్ కోబ్రాలు కాటు వేసిన‌ప్పుడు న్యూరోటాక్సిక్ విషం విడుద‌ల‌వుతుంది. ఒక్క కాటుకే జీవుడు ట‌పా క‌ట్టేస్తాడ‌న్న‌మాట‌. ముంగిస‌కు విషం ఉండదు కానీ.. అది కొరికితే మామూలుగా ఉండ‌దు. చాలా బ‌లంగా కొరుకుతుంది. పాము కాటు వేయ‌డానికి మాత్ర‌మే కొరుకుతుంది. కానీ.. తీవ్ర‌స్థాయిలో గాయం చేసేలా ముంగిస కొరుకుడు ఉంటుంది. అంతేకాదు.. పాము విషం, ప్ర‌త్యేకించి కోబ్రా విషాన్ని సైతం త‌ట్టుకోగ‌లదు. అంటే.. ఆ స్థాయిలో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ఉంటుంద‌న్న మాట‌.

పోరాట బ‌లం సంగ‌తి చెప్పాలంటే.. బ‌లంగా దాడి చేయ‌డం, విషం వెద‌జ‌ల్లి ర‌క్షించుకోవ‌డం కింగ్ కోబ్రా ల‌క్ష‌ణాలైతే.. వేగంగా స్పందించ‌డం, లాఘ‌వంగా దాడి చేయ‌డం, దాడి నుంచి చాక‌చ‌క్యంగా త‌ప్పించుకోవ‌డం ముంగిస ల‌క్ష‌ణాలు. అయితే.. కింగ్ కోబ్రాకు క‌నుక చిక్కిందంటే.. ఆ కాటుతో ముంగిస కూడా చ‌నిపోగ‌ల‌దు. అయితే.. దానికి ఉన్న తెలివి, కింగ్ కోబ్రా తలపైనే టార్గెట్ చేసి దాడి చేయడం, త‌న‌ను తాను కాపాడుకునే ఎత్తుగ‌డ‌లు, దాని 28 పళ్లనూ ఉపయోగించి  బ‌లంగా కొర‌క‌గ‌ల శ‌క్తి వంటివి ఎక్కువ సంద‌ర్భాల్లో ముంగిస‌నే విజేత‌గా నిలిపేందుకు దోహ‌దం చేస్తుంటాయి.

ఎక్కువ మంది చదివిన వార్త.. ఇది కూడా చదవండి..

Knife in Lungs | ఊపిరితిత్తుల్లో 8 సెం.మీ. క‌త్తి.. మూడేండ్ల పాటు న‌ర‌క‌యాత‌న‌
Airtel: ఒక్క ప్లాన్.. 189 దేశాలకు కనెక్టవిటీ

Exit mobile version