Site icon vidhaatha

King Cobra | ఈ పామును చూస్తే.. మీకు రాత్రి నిద్ర కూడా పట్టదు!

King Cobra | పాములతో ఆటలాడేవాళ్లు తరచూ సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూ ఉంటారు. నివాస ప్రాంతాల్లోకి పొరపాటున వచ్చే పాములను అత్యంత జాగ్రత్తగా పట్టుకుని, వాటి ఆవాసాలైన అటవీ ప్రాంతాల్లోకి సురక్షితంగా వదిలేసే వీడియోలూ వస్తుంటాయి. ఇవన్నీ ఒకింత ఆశ్చర్యాన్ని అంతకు మించిన భయాన్ని కలుగ చేస్తాయి. ప్రత్యేకించి కింగ్‌ కోబ్రాలతో వ్యవహరించే వీడియోలు గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. అలాంటి ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నది.  ఈ పామును చూసినప్పుడు మనమేదో వీడియోలో చూసినట్టు కాకుండా త్రీడీలో చూసినట్టుగా మన కళ్ల ముందే ఉందా అని అనిపించక మానదు. పాములంటే భయమున్న వారు ఈ వీడియో ఒక్క సారినా చూసినా వారికి రెండు మూడు రోజులు ఈ పాము కలలోకి  వచ్చి నిద్ర పట్టనియదనడంలో ఏమాత్రం ఆతిశయోక్తి కాదేమో. అంతలా ఈ వీడియో ఉంది.

ఆ వీడియోలో ఒక వ్యక్తి బుసలు కొడుతున్న కింగ్‌ కోబ్రా మెడ నిమురుతూ ఆప్యాంగంగా పలుకరిస్తుంటాడు. అదికూడా సమ్మగా ఉందనుకుందేమో.. చక్కగా నిమిరించుకుని.. వెళ్లిపోతుంది. ఆ సమయంలో అది పడగ విప్పి.. నాలుకను కదుపుతూ భయం గొల్పుతూ ఉంటుంది. కానీ.. ఆ వీడియోలో ఉన్న స్నేక్‌హ్యాండ్లర్‌ మాత్రం.. ఏ మాత్రం జంకు లేకుండా దాని మెడ నిమురుతూ ఉంటాడు. ఈ వీడియోను సాధారణ అటవీ ప్రాంతంలో కాకుండా.. ఒక ల్యాబ్‌లో చిత్రీకరించినట్టు కనిపిస్తున్నది. మెడిసినల్‌ అవసరాల కోసం పాముల విషాన్ని సేకరిస్తారన్న సంగతి తెలిసిందే. ఇలా ఒక కేజ్‌లో ఈ కింగ్‌ కోబ్రా ఉన్న సమయంలో దీనిని వీడియో తీశారు.

కింగ్‌కోబ్రాలు, కోబ్రాలు వేర్వేరు. కింగ్‌ కోబ్రా అనేది ప్రపంచంలోనే అతి పొడవైన, తీవ్రస్థాయిలో విషపూరితమైన పాము మాత్రమే కాదు.. అది తన శరీర భాగంలో మూడో వంతు భాగాన్ని లేపి నిలబడగలదు. అంటే.. సుమారు 12 అడుగుల పాము అయితే.. మనిషి ముఖాన్ని తాకేంత ఎత్తున నిలువగలదు.ఇవి సాధారణంగా 18 అడుగుల వరకూ పొడవు పెరుగుతాయి. దీనిలో ఒక్క కాటు సమయంలో వెలువడే విషం.. కనీసం పది మంది మనుషులను, లేదా ఒక ఏనుగును చంపగలదు. అంతటి విషపూరితమైన కింగ్‌ కోబ్రా.. ఓఫియోఫాగస్‌ హన్నా అనే జాతికి చెందినది. పాములను తినేది అనే అర్థం వచ్చే ఓఫియోఫాగస్‌ జాతికి చెందిన కింగ్‌ కోబ్రాలు.. కోబ్రాలతోపాటు.. ఇతర పాములను కూడా తింటాయని హెర్పెటాలజిస్ట్‌ డాక్టర్‌ అనికా శర్మ చెబుతున్నారు. పర్యావరణ వ్యవస్థలో వాటి పాత్రను ఇవి నొక్కి చెబుతున్నాయని అన్నారు.

 

 

 

 

పాములకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర కథనాలు ఇక్కడ చదవండి..

King Cobra | వామ్మో.. పాము నీళ్లు ఎలా తాగుతుందో చూడండి!
King Cobra, Mongoose Fight | కింగ్ కోబ్రా, తెల్ల తోక ముంగిస మ‌ధ్య ఫైట్‌లో గెలిచేదేంటి?
Snake Dens | దాదాపు లక్షన్నర పాములు ‘కలిసే’ అతిపెద్ద ‘పాముల జాత‌ర’ ఎక్కడో తెలుసా?

Exit mobile version