Brain Reset | ప్రతీరోజూ మనం ఆలోచనలను ఉత్తేజపరిచే అనేక అవకాశాలతో ముంచెత్తబడుతున్నాం. వార్తల ఫీడ్లు, ఇమెయిళ్లు, సోషల్ మీడియా( Social Media ) వంటివి 24/7 అందుబాటులో ఉండటంతో, చాలామంది నిరంతరంగా స్క్రోల్ చేస్తూ, తద్వారా మరింత డోపమైన్( Dopamine ) సరఫరా కోసం వెతుకుతున్నారు. అయితే, ఈ అలవాట్లు మనలో ఒత్తిడిని పెంచే స్థితికి దారి తీస్తున్నాయి. నిజానికి మన మెదడు( Brain ) విశ్రాంతిని కోరుతోంది.
మన మెదడుకు వాస్తవంగా కావలసింది—నిరంతర కేంద్రీకరణ నుండి కొంతకాలం విరామం. ఏ విషయాన్నీ నిరంతరం గమనించకుండా, నిరంతరం ఆలోచించకుండా, మనసును స్వేచ్ఛగా తేలియాడనివ్వడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు, అలాగే కాగ్నిటివ్ సామర్థ్యాలు పెరిగి, మేధస్సు కూడా పదునుగా ఉంటుంది.
కానీ, ఇది మాటలతో చెప్పినంత తేలిక కాదు. నిజ జీవితంలో సాధించడమూ కష్టం. కానీ అటెన్షన్ రెస్టొరేషన్ థియరీ (ART) అనే సిద్ధాంతం మన మెదడుకు తేలికపాటి విరామం ఇచ్చే విధానాన్ని నేర్పుతుందని చెబుతున్నాయి లాంకషైర్ యూనివర్సిటీ ఆర్టికల్స్. ఈ థియరీ పేరు విని అది “ఏమీ చేయకపోవడం” లాంటిదే అనిపించొచ్చు, కానీ దీని వెనుక న్యూరో సైన్స్ ఆధారాలు పుష్కలంగా ఉన్నాయి.