Cyber Fraud | ఆ లింకులను క్లిక్‌ చేస్తున్నారా..? అలా చేస్తే మీ వాట్సాప్‌ అకౌంట్‌ హ్యాకే..!

Cyber Fraud | ప్రస్తుత కాలంలో సైబర్‌ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కొత్త కొత్త మార్కెట్లో నేరగాళ్లు పెట్రేగిపోతున్నాయి. అయితే, వాట్సాప్‌లో వచ్చే లింక్స్‌తో జాగ్రత్తగా ఉండాలని.. తెలియకుండా క్లిక్‌ చేస్తే ముప్పు తప్పదని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • Publish Date - June 18, 2024 / 09:41 AM IST

Cyber Fraud | ప్రస్తుత కాలంలో సైబర్‌ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కొత్త కొత్త మార్కెట్లో నేరగాళ్లు పెట్రేగిపోతున్నాయి. అయితే, వాట్సాప్‌లో వచ్చే లింక్స్‌తో జాగ్రత్తగా ఉండాలని.. తెలియకుండా క్లిక్‌ చేస్తే ముప్పు తప్పదని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు నిజామాబాద్‌ జిల్లాలో ఇటీవల జరిగిన ఘటనను ఉదాహరణగా చూపుతున్నారు. సిరికొండం మండలం సోంపెల్లి గ్రామానికి చెందిన పదిమంది వాట్సాప్‌ ఖాతాలు హ్యాకింగ్‌ బారినపడ్డాయని.. వారి పేరుతో గుర్తు తెలియని వ్యక్తులకు మెసేజ్‌లను పంపుతున్నట్లు తేలింది.

అయితే, ఇటీవల గ్రామస్తుల వాట్సాప్‌ గ్రూప్‌లోకి పీఎం కిసాన్‌ యాప్‌ లింక్‌ కొందరు ఫార్వర్డ్‌ చేశారు. ఈ నెల 18న పీఎం కిసాన్‌ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో వాట్సాప్‌ గ్రూప్‌లలో ఈ లింక్‌ చక్కర్లు కొడుతున్నది. పీఎం కిసాన్ డబ్బులు తమ ఖాతాలో పడతాయనే ఉద్దేశంతో రైతులు ఆయా లింక్‌లపై క్లిక్‌ చేస్తున్నారు. ఆ లింకులను క్లిక్‌ చేసిన కొద్దిసేపటి తర్వాత తమ వాట్సాప్‌ అకౌంట్‌ పని చేయడం లేదని పలువురు రైతులు పేర్కొన్నారు. తమ పేరిట మెసేజ్‌లు వెళ్తున్నాయని వాపోయారు.

ఆ తర్వాత బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయమై సైబర్‌ క్రైం డీఎస్పీ హసీద్‌ ఉల్లాను మీడియా సంప్రదించగా.. మొబైల్‌లో వచ్చే యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పీఎం కిసాన్‌ యాప్‌ పేరుతో ఏదైనా లింక్ వస్తే ఓపెన్ చేయొద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్‌ ఫ్రీ నెంబర్‌ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా లింక్‌లో సోషల్‌ మీడియాలో భారీగానే వస్తున్నాయి. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు.

Latest News