విదేశాలపై ఆధారపడకుండా స్వదేశీ సాంకేతికతతో కూడిన యాప్ లను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా పిలుపునిస్తున్న విషయం తెలిసిందే. మూడు రోజుల వ్యవధిలో మేడిన్ ఇండియా సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ ఒకటి మూడున్నర లక్షల వరకు డౌన్ లోడ్ అయ్యాయి. ప్రైవసీ ఫస్ట్, స్పై వేర్ ఫ్రీ అనే నినాదంతో ఈ యాప్ ను రూపొందించడంతో భారతీయులు అత్యధికంగా డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. మున్ముందు ఇది వాట్సప్ కు పోటీ గా మారుతుందా అంటే అవుననే విధంగా ఆరట్టై మెస్సేజింగ్ యాప్ ఉంది.
ఆరట్టై అంటే తమిళ భాషలో క్యాజువల్ ఛాట్ అని అర్థం. ఈ యాప్ ను జోహో కార్పొరేషన్ ను ఆవిష్కరించింది. వన్ టూ వన్, గ్రూప్ ఛాట్స్, వాయిస్ నోట్స్, ఇమేజ్ అండ్ వీడియో షేరింగ్, స్టోరీస్, బ్రాడ్ కాస్ట్ ఛానల్స్ వంటి సేవలు అందిస్తున్నది. ఆడియో అండ్ వీడియో కాల్స్, ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిఫ్షన్, మల్టీ డివైస్ సఫోర్టు, డెస్క్ టాప్ యాప్స్, క్రియేటర్స్, ఇన్ ప్లుయన్సర్స్, వ్యాపారవేత్తలు స్టోరీస్ బ్రాడ్ కాస్ట్ చేసుకోవచ్చు. ప్రైవసీ ప్రధానంగా, పర్సనల్ డేటా రక్షణ కోసం ఈ యాప్ రూపొందించారు. 2021 లోనే ఆరట్టై మెస్సేజింగ్ యాప్ సిద్ధమైనప్పటికీ, ఈ మధ్యకాలంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ దీన్ని ప్రమోట్ చేశారు. దేశంలోనే రూపుదిద్దుకున్న ఈ యాప్ ను విరివిగా ఉపయోగించాలని దేశ ప్రజలకు పిలుపునివ్వడంతో డౌన్ లోడ్లు ఒక్కసారిగా పెరిగాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే మూడున్నర లక్షలు డౌన్ లోడ్ అయ్యాయి. దీంతో ఒత్తిడి పెరగడంతో జోహో కార్పొరేషన్ చర్యలు ప్రారంభించింది. కొత్తగా చేరే వారికి ఓటీపీ లు వెంటనే రావడం లేదని, కాంటాక్టులు సింకింగ్ కావడం లేదని, కాల్ డ్రాప్స్ ఉన్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి. వాస్తవంగా నవంబర్ లో యాప్ ను అధికారికంగా విడుదల చేయాలని అనుకున్నామని, ఈ లోపే ప్రజల్లోకి వెళ్లిందని జోహో కార్పొరేషన్ అధినేత శ్రీధర్ వెంబు తెలిపారు.
ప్రస్తుతం భారత దేశంలో వాట్సప్ మెస్సేజింగ్ యాప్ ను 500 మిలియన్ల మంది వినియోగిస్తున్నారు. ప్రజల దినచర్యలో ఇది భాగమై పోయింది. వాట్సప్ మాదిరి ఆరట్టై యాప్ సేవలు అందిస్తుందా, అలా అందించాలంటే ఎంతో శ్రమకు ఓర్చాల్సి ఉంటుంది. కాల్స్ ఎన్ క్రిప్ట్ అయినప్పటికీ, ఛాట్స్ కాలేదు.
తమిళనాడు రాష్టంలో 1968 లో జన్మించిన శ్రీధర్ వెంబు మద్రాస్ ఐఐటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఆ తరువాత అమెరికాలోని ప్రిన్స్ టన్ యూనివర్సిటీ నుంచి పీ.హెచ్.డీ చేశారు. క్వాల్ కామ్ లో డిజైన్ ఇంజనీర్ చేసి, వైర్ లెస్ టెక్నాలజీ పై పనిచేశారు. పరిస్థితుల ప్రభావంతో తిరిగి తమిళనాడు వచ్చి టెంకసి గ్రామంలో స్థిరపడ్డారు. ప్రపంచ సాంకేతిక మెట్రో నగరాల నుంచి రాదని, గ్రామాల నుంచి వస్తుందని బలంగా నమ్మాడు. 1996 లో అడ్వెంట్ నెట్ ను ఆవిష్కరించారు. జోహో కార్పొరేషన్ లో ప్రస్తుతం 3వేల మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పనిచేస్తుండగా, 50 క్లౌడ్ ఉత్పత్తులను ఆవిష్కరించగా, 180 దేశాలలో వినియోగిస్తున్నారు. దేశంలో ముంబై, ఢిల్లీ, చెన్నై లో డేటా కేంద్రాలు ఉన్నాయని త్వరలో ఒడిశాలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భారతీయుల డేటా ఇక్కడే భద్రపరుస్తున్నామన్నారు. విదేశాలలో కూడా 18 డేటా సెంటర్లు ఉన్నాయని, ప్రతి దేశానికి సంబంధించి డేటా అక్కడే స్టోర్ చేస్తున్నామన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసు, అజూర్, గూగుల్ క్లౌడ్ లో జోహో ఉత్పత్తులు హోస్ట్ కావడం లేదని శ్రీధర్ స్పష్టం చేశారు. మంగళవారం నాడు చెన్నైలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ తో శ్రీధర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది.