Site icon vidhaatha

93ఏళ్ల వయసులో పీహెచ్‌డీ పట్టా


విధాత : 93ఏళ్ల వయసులో ఆ పెద్దావిడ పీహెచ్‌డి పట్టా అందుకుంది. మంగళవారం జరిగిన హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం 83వ స్నాతకోత్సవంలో 93 ఏళ్ల రేవతి తంగవేలు ఆంగ్ల భాషలో పీహెచ్‌డీ పట్టా అందుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలచింది.


ఆంగ్ల భాషలో వ్యాకరణం, వర్ణమాలతో పాటు పదాల కూర్పు వంటి భాషాపరమైన అంశాలపై రేవతి తంగవేలు చేసిన ప పరిశోధనలు ఆమెకు పీహెచ్‌డీ డాక్టరేట్‌ పట్టాను అందించాయి. 1990లో అధ్యాపకురాలుగా పదవీ విరమణ చేసిన రేవతి తంగవేలు సికింద్రాబాద్లోని కీస్ ఎడ్యుకేషనల్ సొసైటీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Exit mobile version