Site icon vidhaatha

ఈ నెల 6 న హైదరాబాద్ కు అమిత్ షా

Amit Shah

హైదరాబాద్, సెప్టెంబర్ 3(విధాత): కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 6 హైదరాబాద్ రానున్నారు. బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొననున్నారు. 6వ తేదీ మధ్యాహ్నం1.10 నిమిషాలకి బేగం పేట ఎయిర్పోర్ట్‌కు చేరుకోనున్నారు. తర్వాత 2 గంటల నుంచి 3 గంటల వరకు బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4.10 నుంచి 4.55 వరకు మోజంజాహి మార్కెట్‌ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొననున్నారు. తిరిగి సాయంత్రం 5.05 నిమిషాలకు బేగం పేట నుండి ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.

Exit mobile version